సూర్యకు చెప్పడమా? అంత సీన్ లేదు.. ఆ షాట్లకు నేనైనా వణకాల్సిందే: హార్దిక్ పాండ్యా

రాజ్‌కోట్: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్య.. తనదైన బ్యాటింగ్‌తో అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాడని, బ్యాటింగ్ చాలా ఈజీ అని అందరూ అనుకునేలా ఆడుతాడని కొనియాడాడు. శ్రీలంకతో శనివారం జరిగిన మూడో టీ20లో సూర్య(51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
దాంతో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 91 పరుగులతో గెలుపొంది 2-1తో మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యాను సూర్య సెన్సేషనల్ బ్యాటింగ్ గురించి హోస్ట్ హర్షా భోగ్లే అడగ్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బ్యాటింగ్ ఈజీ అన్నట్లు..
'సూర్య తన బ్యాటింగ్‌తో ప్రతీ ఒక్కరిని సర్‌ప్రైజ్ చేస్తాడు. బ్యాటింగ్ చాలా సులువని ప్రతీ ఒక్కరు అనుకునేలా ఆడుతాడు. నేను బౌలింగ్ చేసినా.. అతని అసాధారణ షాట్లతో నిరుత్సాహానికి గురవ్వాల్సిందే. కళ్లు బైర్లు గమ్మే షాట్లతో విరుచుకుపడుతాడు. రాహుల్ త్రిపాఠి ఆడిన ఇన్నింగ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకొవాలి. బంతి స్వింగ్ అవుతున్న పరిస్థితుల్లో అతను అద్భుతంగా ఆడాడు.
బౌలర్లపై విరుచుకుపడి మూమెంటమ్‌ను అందించగా.. సూర్య దాన్ని కొనసాగించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్‌కు ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను కఠిన పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతుంటే ఓ పరిష్కారం చెబుతాం. తరుచుగా తన సొంత ప్రణాళికతోనే బరిలోకి దిగుతాడు.

నా ఆటగాళ్లకు అండగా ఉండటం..
అక్షర్ పటేల్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఈ సిరీస్ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. టీమ్ బలాన్ని కూడా పెంచింది. నా ఆటగాళ్లకు అండగా ఉండటమే నా విధానం. వీళ్లంతా అత్యుత్తమ టీ20 ఫార్మాట్ ఆటగాళ్లు. వీళ్లు టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ భారత క్రికెటర్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్లపై సందేహం ఉండకూడదు. ఈ సిరీస్‌లో మేం ఆడిన తీరు చాలా సంతోషాన్నిచ్చింది. మేం పోటీ పడిన విధానం ముచ్చటేసింది. మాదైన రోజున నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటాం. ఈ విజయాలను ఇలానే కొనసాగిస్తాం'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

సూర్య ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్) సెన్సేషనల్ సెంచరీకి అండగా శుభ్‌మన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(35), అక్షర్ పటేల్(21 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో మదుషంక రెండు వికెట్లు తీయగా.. కసన్ రజిత, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. 16.4 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(23), కుశాల్ మెండిస్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications