నాకు బౌలింగ్ చేసే బ్యాటర్లు కావాలి: హార్దిక్ పాండ్యా

మౌంట్‌మాంగనీ: భారత జట్టులో మరిన్ని బౌలింగ్ ఆప్షన్స్ చూడాలనుకుంటున్నానని తాత్కలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 65 పరుగులతో ఘన విజయాన్నందుకుంది. ఈ సిరీస్‌లో తాత్కలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హార్దిక్ పాండ్యా భవిష్యత్తులో పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా మారే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన బీసీసీఐ.. ముందుగా సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది.
కొత్త సెలెక్షన్ కమిటీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అంతేకాకుండా వేర్వేరు కెప్టెన్ల పద్దతిని అనుసరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసి 2024 టీ20 ప్రపంచకపే లక్ష్యంగా జట్టును సిద్దం చేయాలని భావిస్తోంది.

బౌలింగ్ ఆప్షన్స్ కావాలి..
బీసీసీఐ నుంచి కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యాకు కూడా స్పష్టమైన ఆదేశాలు అందినట్లున్నాయి. న్యూజిలాండ్ సిరీస్‌తోనే ప్రపంచకప్ సన్నాహకాలు మొదలయ్యాయని హార్దిక్ సిరీస్ ప్రారంభానికి ముందే చెప్పాడు. ఇక న్యూజిలాండ్‌తో విజయానంతరం మాట్లాడుతూ జట్టులో వీలైనన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉండాలని, బౌలింగ్ చేయగల బ్యాటర్లు కావాలని చెప్పాడు. ఆల్‌రౌండర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశాడు. ఇక అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

బౌలింగ్ చేసే బ్యాటర్లు..
'ఈ మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మేం 170-175 పరుగులు చేయాలనుకున్నాం. సూర్య సూపర్ బ్యాటింగ్ కారణంగా 20 పరుగులు అదనంగా చేశాం. బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. దూకుడుగా బౌలింగ్ చేశాడు. ప్రతీ బంతికి వికెట్ తీయకున్నా.. దూకుడుగా బౌలింగ్ చేయడం ముఖ్యం. పరిస్థితులు బౌలర్లకు ప్రతికూలంగానే ఉన్నాయి. బంతి తడిగా మారింది. అయినా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను చాలా బౌలింగ్ చేశాను. ఇక జట్టులో మరిన్నీ బౌలింగ్ ఆప్షన్స్ కావాలనుకుంటున్నా.

అందరికి అవకాశం ఇవ్వలేం కదా..
ప్రతీసారి బౌలర్లే రాణించాలంటే కుదురదు. కాబట్టి బౌలింగ్ చేయగల బ్యాటర్లు జట్టులో ఉండాలనుకుంటున్నా. ప్రోషెనల్ ఆల్‌రౌండర్ల కోసం వేచి చూస్తున్నా. ఇక జట్టులో మంచి వాతావరణం ఉంది. ఒకరి సక్సెస్‌ను మరొకరు ఆస్వాదిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. చివరి టీ20లో మార్పుల గురించి నాకు తెలియదు. ప్రతీ ఒక్కరికి అవకాశం ఇవ్వాలని ఉన్నా.. ఒక్కటే మ్యాచ్ మిగిలి ఉంది. కాబట్టి అందరికి అవకాశం ఇవ్వడం కుదరదు.

సూర్య సూపరో సూపర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(3/34) హ్యాట్రిక్ వికెట్ సాధించగా.. లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్(52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీపక్ హుడా (4/10) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసారు. భువనేశ్వర్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications