For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందతా టైమ్‌ వేస్ట్‌ యవ్వారం.. సెంచరీలపై హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు!

సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేయడం టైమ్ వేస్ట్ వ్యవహారమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తన దృష్టిలో సెంచరీలు, హాఫ్ సెంచరీలు అంకెలు మాత్రమేనని స్పష్టం చేశాడు. వాటికి పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. చీల మండ గాయంతో గత ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు.

అప్‌కమింగ్ సీజన్ కోసం క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఆ జట్టు సారథ్య బాధ్యతలు కూడా అందుకున్నాడు. తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్వ‌హించిన ఫ్యాన్ ఈవెంట్‌లో మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Hardik Pandya says I don t believe in 50 or 100s a waste of time

ఐపీఎల్‌లో 10 హాఫ్ సెంచరీలు చేయడంపై అభిమానులు ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నా దృష్టిలో హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు కేవలం అంకెలు మాత్రమే. అదంతా వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌'అని పేర్కొన్నాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీల కంటే జట్టు కోసం చేసిన పరుగులకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు.

10 హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌ల్లో బాగా నచ్చేది ఏది? అని ప్రశ్నించగా.. ఈ 10 ఇన్నింగ్స్‌ల్లో ఓడిపోయిన మ్యాచ్ తనకు నచ్చదని పేర్కొన్నాడు. సెంచరీలపై పాండ్యా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. ఎవర్ని ఉద్దేశించి పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశాడని, కోహ్లీ, రోహిత్‌లను తక్కువ చేసే ప్రయత్నంలోనే ఇలా మాట్లాడాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

సెంచరీలు, హాఫ్ సెంచరీలు కూడా జట్టు విజయాల్లో భాగమవుతాయనే విషయాన్ని హార్దిక్ గ్రహించలేకపోతున్నాడని కొందరు సెటైర్లు పేల్చుతున్నారు.

నా కెరీర్‌లో ఆ ఏడాది బెస్ట్..
త‌న కెరీర్‌లో 2015 అద్భుత‌మైన ఏడాది అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'ఐపీఎల్‌లో 2015 నాకు ఎంతో ప్ర‌త్యేకం. ఆ ఏడాది ప్ర‌ద‌ర్శ‌న‌తోనే నేను అంతర్జాతీయ ఆటగాడిగా మారాను. ఒక‌వేళ ఈ ఏడాది నేను విఫ‌లమై ఉంటే.. ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ఆ సీజ‌నంతా ముంబై విజ‌యాల్లో నా వంతు పాత్ర పోషించినందుకు చాలా అదృష్ట‌వంతుడిగా ఫీలవుతున్నా.

ఆ సీజన్‌లో నాకు ఉన్న మధురమైన జ్ఞాపకం ఏంటంటే.. చావోరేవో లాంటి రెండు మ్యాచుల్లో నేను ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం. అందుకే ఆ ఏడాది నా జీవిత‌ంలోనే అద్భుత‌మైన‌ది. అక్క‌డితోనే నా క్రికెట్ ప్ర‌యాణం మొద‌లైంది. ఐపీఎల్ 2015 కార‌ణంగానే గుజ‌రాత్ నుంచి పెద్ద క‌ల‌ల‌తో వ‌చ్చిన ఓ కుర్రాడు ఛాంపియన్‌ ప్లేయర్‌గా నిలవగలిగాడు'అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, March 4, 2024, 16:50 [IST]
Other articles published on Mar 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+