నా బౌలింగ్ విలువ ఏంటో తెలుసుకున్నా: హార్దిక్ పాండ్యా

సెయింట్ క్వీన్స్: భారత జట్టులో తన బౌలింగ్ విలువ ఏంటో తెలుసుకున్నానని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తాను పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల జట్టుకు సమతూకం వస్తుందనే విషయాన్ని గ్రహించానని తెలిపాడు. వెస్టిండీతో బుధవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (1/19) బౌలింగ్‌తో సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (76) అదరగొట్టేశారు. టీ20ల్లో టీమిండియా ఓపెనర్‌గా మారిన సూర్యకుమార్ తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే మూడో టీ20లో మాత్రం చెలరేగాడు. మ్యాచ్ అనంతరరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.

సూర్య అసాధారణమైన ప్లేయర్..
'సూర్యకుమార్ యాదవ్ అసాధారణమైన ఆటతీరు కలిగిన ప్లేయర్. అతడు షాట్లు కొడుతుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. విండీస్‌పై మూడో టీ20 గెలవడంలో అతడి ఇన్నింగ్సే కీలకం. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా అందిపుచ్చుకోవడంలో మాత్రం ముందుంటాడు. దాని కోసం చాలా కష్టపడ్డాడు. ఇక నేను పూర్తి ఓవర్లను పూర్తి చేస్తుండటం బాగుంది. బౌలింగ్ చేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తుంటా. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. గాయం తర్వాత కోలుకున్నప్పటి నుంచి పూర్తి కోటాను వేయడానికి కాస్త సమయం తీసుకున్నా.

నా బౌలింగ్‌తో సమతూకం..
నేను ఇలా బౌలింగ్ చేయడం వల్ల జట్టులో సమతూకం వస్తుందనే విషయాన్ని గ్రహించా. కెప్టెన్‌తోపాటు జట్టుకు నాపై నమ్మకం వచ్చేలా చేయగలిగాను. ఇంతకుముందు వేరొకరు బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే నేను బౌలింగ్‌కు వచ్చేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి ఓవర్లను వేయగలనని గర్వంగా చెప్పగలను. అలానే బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తానని నమ్మకంతో ఉన్నా'' అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

చాలా కష్టపడ్డాను..
విండీస్‌తో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడంపై హార్దిక్ సంతోషం వ్యక్తం చేశాడు. ''గాయపడటం లేదా ఫామ్ కోల్పోయి బయటకు వెళ్లాక టీమ్‌లోకి మళ్లీ రావాలంటే చాలా కష్టపడాలి. దాని కోసం నేను చాలా హార్డ్‌వర్క్ చేశా. అందుకే నేను బాగా ఆడినా.. ఆడకపోయినా ఒకేలా రియాక్షన్ ఇవ్వడం అలవాటు చేసుకున్నా. ఇక భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండటం గౌరవమే. సారథి రోహిత్ శర్మ మాకు ఎంతో స్వేచ్ఛనిస్తాడు. అదే అతని బలం.

ఆ ఇద్దరివల్లే విజయాలు..
విజయాలు సాధించడానికి ఇద్దరే కారణం. వారిలో ఒకరు రోహిత్ కాగా.. మరొకరు రాహుల్ ద్రవిడ్. జట్టును సమష్టిగా ఉంచడంతోపాటు సానుకూల వాతావరణం సృష్టిస్తారు. అందుకే ఆటగాళ్లు ఎప్పుడూ సురక్షితంగా ఉన్నామనే భావనతో ఉంటారు. కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చి మాలోని ఆటను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు.'అని హార్దిక్ తెలిపాడు. విండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్ ఆగస్టు 6న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications