For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya ఆ రాత్రి మొత్తం నిద్ర పోలేదు.. మైదానంలో చెమటలు కక్కిస్తే సెట్ అయ్యాడు: చిన్న నాటి కోచ్

 Hardik Pandya’s childhood coach Jitender Singh recalls ‘Koffee With Karan’ controversy

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలవడంతో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజాలు హార్దిక్ సారథ్యాన్నికొనియాడుతూ టీమిండియా భవిష్యత్తు సారథని జోస్యం చెబుతుండగా.. అతని చిన్ననాటి కోచ్ జితేందర్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా భావోద్వేగపూరితమైన వ్యక్తని, అతని డ్రెస్స్, చైన్స్ చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దన్నాడు. అతను చాలా మంచి మనస్సు ఉన్న వ్యక్తని చెప్పుకొచ్చాడు. తన శిష్యుడు ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో జితేందర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు.

 చెమటలు కక్కిస్తే..

చెమటలు కక్కిస్తే..

కష్టాలు ఎదురైనప్పుడల్లా హార్దిక్ నేలకు కొట్టిన బంతిలా తిరిగొస్తాడని చెప్పాడు. కాఫీ విత్ కరణ్ షోలో చోటు చేసుకున్న వివాద సమయంలో హార్దిక్ చాలా బాధపడ్డాడని తెలిపాడు. ఆ వివాదంతో నిషేధానికి గురైన అతను ఆ రాత్రి అంతా నిద్రపోలేదని తెలిపాడు. అయితే మైదానంలో చెమటలు కక్కిస్తే సెట్ అయ్యాడని చెప్పిన జితేందర్.. మళ్లీ ఇలా చెడ్డ పేరు తెచ్చుకోనని మాట ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. అతని తండ్రి ఇప్పుడు ఉంటే చాలా సంతోషించేవాడని తెలిపాడు.

బీసీసీఐ సస్పెండ్ చేయడంతో..

బీసీసీఐ సస్పెండ్ చేయడంతో..

'కాఫీ విత్ కరణ్ షోలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో హార్దిక్ పాండ్యాను బీసీసీఐ సస్పెండ్ చేసింది. దాంతో అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ రాత్రంతా నిద్ర పోలేదు. ఈ విషయం తెలిసి నేను అతనితో మాట్లాడాను. టెన్షన్ పడవద్దని సూచించాను. అతి త్వరలోనే మళ్లీ టీమిండియాకు ఆడుతావని ఓదార్చాను. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి పెద్దగా ఆలోచించకు వెంటనే రిలియన్స్ స్టేడియంకు రా అని చెప్పాను.

మళ్లీ ఇలా చేయనని ప్రామిస్ చేశాడు..

మళ్లీ ఇలా చేయనని ప్రామిస్ చేశాడు..

ఇక హార్దిక్ కోసం నేను బ్యాడ్మింటన్ కోర్ట్ బుక్ చేశాను. ఇద్దరం కలిసి చాలా సేపు ఆడాం. బ్యాడ్మింటన్ ఆడుతూ అతని చెమటలు కక్కించాను. దాంతో అతను ఆ వివాదం నుంచి తేరుకున్నాడు. క్రీడల్లో ఉన్న మజా ఏంటో తెలుసుకున్నా. తాను పుట్టింది క్రీడాకారుడిగా రాణించేందుకే తప్పా చాట్ షోస్ కాదనే విషయాన్ని గ్రహించాడు. మళ్లీ తన గురించి నెగటీవ్ కామెంట్స్ వినబడే అవకాశం ఇవ్వనని నాకు మాటిచ్చాడు. అతను తన మాటపై నిలబడ్డాడు. హార్దిక్ తండ్రి ఇప్పుడు ఉండి ఉంటే చాలా గర్వపడేవాడు.'అని జితేందర్ చెప్పుకొచ్చాడు.

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..

కాఫీ విత్ కరణ్' షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి 'ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో ఈ ఇద్దరి ఆటగాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.

Story first published: Monday, May 30, 2022, 19:09 [IST]
Other articles published on May 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+