
మొకాలి గాయంతోనే..
'రుతురాజ్ మోకాలి గాయంతో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు ఓపెనింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. కానీ ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని మేము భావించాము. ఎందుకంటే మ్యాచ్ కంటే ఆటగాడి శారీరక శ్రేయస్సు చాలా ముఖ్యమైనది. మా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మేము విజయం సాధించాము. కాబట్టి గైక్వాడ్ బ్యాటింగ్‌కు రాకపోవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు" అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో హార్ధిక్ పాండ్యా స్పష్టం చేశాడు.

సంజూ శాంసన్‌కు చాన్స్
హార్దిక్ వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం జరిగే రెండో టీ20లో గైక్వాడ్ బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. గైక్వాడ్ దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరమవ్వడం టీమిండియాకు ఇబ్బంది పెట్టే అంశమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని గైర్హాజరీ కారణంగా స్పెషలిస్ట్ ఓపెనర్ జట్టుకు అందుబాటులో లేకుండా పోతాడని అంటున్నారు.

హుడా చెలరేగడంతో..
వర్షం అంతరాయం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ (1/16), యుజ్వేంద్ర చాహల్ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హ్యారీ టెక్టార్ ( 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) ఆతిథ్య జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. అనంతరం దీపక్ హుడా ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లతో 47 నాటౌట్), ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 ), హార్దిక్ పాండ్యా ( 12 బంతుల్లో ఫోర్, మూడు సిక్స్‌లతో 24) చెలరేగడంతో భారత్.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ (2/18) ఒక్కడే ప్రభావం చూపాడు.


Click it and Unblock the Notifications












