
అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న టైటిల్ ఫైట్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సంజూ తెలిపాడు. డ్రైగా కూడా ఉందని, సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలిపాడు. తాము చాలా సానుకూలంగా, ఉత్సాహంగా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇంత మంది అభిమానుల మధ్య ఆడుతుండటం వినూత్న అనుభూతిని ఇస్తుందని తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు.
ఇక తాము టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇంతమంది తమకు మద్దతు తెలపడం అద్భుతమని చెప్పాడు. హీరోలుగా నిలిచేందుకు ఇది మాకు బంగారం లాంటి అవకాశమన్నాడు. ప్రశాంతంగా ఉంటూ ప్రణాళికలకు తగ్గట్లు ఆడితే విజయం సాధించవచ్చన్నాడు. గుజరాత్ ప్రజలు మద్దతు మాకే ఉంటుందని చెప్పాడు. వారి సమక్షంలో మ్యాచ్ ఆడటం కోసం ఉత్సాహంగా ఉన్నామన్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన హార్దిక్ పాండ్యా.. అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ వచ్చాడని చెప్పాడు.
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్నందుకొని నేరుగా ఫైనల్ చేరుకుంది. ఇక క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్.. ఆర్‌సీబీని ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. అయితే గుజరాత్ టైటాన్స్‌కు చేజింగ్ కలిసొచ్చే అంశం. అది తెలిసి కూడా సంజూ వారికి చేజింగ్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్