Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రోహిత్, కోహ్లీ ఆడటం లేదు: హార్దిక్ పాండ్యా

కెన్సింగ్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కీలక మార్పులు చేసింది. ఊహించినట్లుగానే సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి బెంచ్ ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో మనమంతా చూశాం. పిచ్ కండిషన్స్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే మాకు సిరీస్ గెలిచే అవకాశాలు సజీవంగా ఉంటాయి.

 Hardik Pandya:

ఈ మ్యాచ్ ఫలితాన్ని ఊహించలేం. ఎందుకంటే ఇరు జట్లు ఒకే పిచ్‌పై ఆడబోతున్నాయి. మేం మా బౌలింగ్‌తో భారత్‌ను ఒత్తిడిలోకి నెడుతాం. జట్టులో రెండు కీలక మార్పులు చేశాం. పోవెల్, డ్రేక్స్ దూరం కాగా.. అల్జారీ జోసెఫ్, కీసీ కార్టీ జట్టులోకి వచ్చారు.'అని టాస్ సందర్భంగా షై హోప్ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిచినా.. తాము బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని టీమిండియా తాత్కలిక సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు. 'ఈ పిచ్‌పై మేం ఎన్ని పరుగులు చేస్తామో చూడాలనుకుంటున్నాం. రోహిత్, కోహ్లీ తీరిక లేకుండా క్రికెట్ ఆడుతుండటంతో రెస్ట్ ఇచ్చాం. జట్టులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునేందుకు వారు ఈ మ్యాచ్‌‌కు దూరంగా ఉన్నారు.

మూడో వన్డేలో ఫ్రెష్‌గా బరిలోకి దిగుతారు. ఓ జట్టు 115 పరుగులకు ఆలౌట్ అయ్యిందంటే అందులో బౌలర్ల శ్రమ ఎంతో ఉందని అర్థం. తొలి వన్డేలో మా క్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంది. కానీ మేం కొన్ని ప్రదేశాల్లో ఇంకా మెరుగ్వాల్సి ఉంది. చేజింగ్‌లో మేం ఐదు వికెట్లు కోల్పోవడం ఏమాత్రం ఆహ్వానించ తగినది కాదు. రెండు వికెట్లు కోల్పోయి చేధించాల్సిన లక్ష్యం అది.

కోహ్లీ, రోహిత్ స్థానాల్లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.'అని హార్దిక్ పాండ్యాచెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో రాణిస్తేనే అతను వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో కొనసాగుతాడు. లేకుంటే అతన్ని పూర్తిగా పక్కనపెట్టనున్నారు. జయదేవ్ ఉనాద్కత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్.

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథనాజ్, షైహోప్, షిమ్రాన్ హెట్‌మైర్, కీసీ కార్టీ, రోమారియో షెఫెర్డ్, యాన్నిక్ కారయ్య, గడకేష్ మోతీ, అల్జారీ జోసెఫ్, జైడేన్ సీల్స్.

Story first published: Saturday, July 29, 2023, 19:08 [IST]
Other articles published on Jul 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+