Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే హర్షల్ పటేల్‌ను పక్కన పెట్టాం: హార్దిక్ పాండ్యా

Hardik Pandya reveals the reason why Harshal Patel not playing in 2nd T20 against Sri Lanka

పుణే: శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ వికెట్‌పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారికి మెరుగైన రికార్డు ఉందనే విషయం తనకు తెలియదన్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగామని చెప్పిన హార్దిక్.. గాయంతో జట్టుకు దూరమైన సంజూ శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు.

ఫిట్‌నెస్ సాధించిన అర్ష్‌దీప్ సింగ్.. హర్షల్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చాడని చెప్పాడు. అర్ష్‌దీప్ సింగ్ కోసమే హర్షల్ పటేల్‌ను తప్పించాల్సి వచ్చిందన్నాడు. వాంఖడేలో 160 పరుగులు డిఫెండ్ చేయడం గొప్ప విషయమని చెప్పిన హార్దిక్.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

టాస్ గెలిస్తే తాము ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన వారికే మెరుగైన రికార్డు ఉందని తెలిపాడు. టాపార్డర్ రాణించడం ముఖ్యమని తెలిపిన షనక.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటుతారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. తొలి టీ20లో 2 పరుగులతో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్ ఎలాగైన గెలిచి సిరీస్ రేసులో నిలవాలనుకుంటోంది.

తుది జట్లు:

భారత్: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కాసున్ రజిత, దిల్షాన్ మదుషంక

Story first published: Thursday, January 5, 2023, 19:06 [IST]
Other articles published on Jan 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+