హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. ఇక అక్కడే మకాం!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన క్రికెట్ కెరీర్‌ను మరింత కాలం పొడిగించుకునేందుకు బెంగళూరుకు మకాం మార్చాడు. తన రోజువారీ ప్రాక్టీస్‌తో పాటు ఫిట్‌నెస్ మెరుగుపర్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి పూర్తి కాలం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో గడపడనున్నాడు.
జాతీయ జట్టు, ఐపీఎల్‌కు ఆడని సమయంలో బీసీసీఐ సీఓఈలో ట్రైనింగ్ తీసుకోనున్నాడు. సాధారణంగా క్రికెటర్లు గాయాలపాలైనప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంటారు. కానీ, హార్దిక్ ఈ కేంద్రాన్ని తన సొంత హోమ్ బేస్‌గా మార్చుకున్నాడు. ఇలా చేసిన తొలి భారత సీనియర్ క్రికెటర్‌గా నిలిచాడు.
బెంగళూరుకి మకాం..
బరోడాకు చెందిన హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అక్కడ ట్రైనింగ్ కోసం ముంబై ఇండియన్స్ హై-పర్‌ఫార్మెన్స్ సెంటర్‌కు వెళ్తున్నాడు. అయితే విపరీతమైన ట్రాఫిక్ వల్ల రోజూ గంటల కొద్దీ ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ప్రయాణ అలసట నుంచి విముక్తి పొందేందుకు.. అలాగే మెరుగైన ట్రైనింగ్ కోసం హార్దిక్ పాండ్యా బెంగళూరుకు మాకాం మార్చాడు.

బెంగళూరు శివార్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమీపంలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రాబోయే ఐదారేళ్ల పాటు భారత్ తరఫున వైట్‌బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా హార్దిక్ సిద్దమవుతున్నాడు.
గాయాలతో సావాసం..
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ గాయంతోనే అతను అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. గత 6 నెలల్లో ఎక్కువ భాగం బెంగళూరులో సీఓఈలోనే గడిపిన హార్దిక్ పాండ్యా.. త్వరలోనే మళ్లీ రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నాడు.
గత రెండేళ్లలో చీలమండ, నడుము నొప్పి సమస్యలతో హార్దిక్ ఆటకు దూరమయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ మధ్యలోనే చీల మండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హార్దిక్ నిశ్చయించుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత జింబాబ్వే సిరీస్‌తో హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి.. బీసీసీఐ పరీక్షల్లో నెగ్గితేనే భారత జట్టులోకి వస్తాడు. బెంగళూరుకు మకాం మార్చిన హార్దిక్ పూర్తిగా ఫిట్ అవుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

