Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విడాకుల తర్వాత నటాషా పోస్ట్‌.. లవ్ సింబల్‌తో హార్దిక్ పాండ్యా కామెంట్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా‌తో విడాకుల అనంతరం బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. విడాకుల అనంతరం ముంబైని వదిలి సొంత దేశం సెర్బియా వెళ్లిపోయిన నటాషా... అక్కడ కుమారుడు అగస్త్యాతో కలిసి థీమ్ పార్క్‌కు వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.

అయితే ఈ పోస్ట్‌పై హార్దిక్ పాండ్యా స్పందించడం చర్చనీయాంశమైంది. సూపర్ అనే ఏమోజీతో పాటు రెడ్ హార్ట్ ఏమోజీని హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. విడిపోయిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా.. తన మాజీ సతమణి పట్ల అదే గౌరవాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం సోషల్ మీడియా వేదికగా నటాషా తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కొందరు పనిగట్టుకొని మరీ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. ఆమె పోస్ట్‌పై కామెంట్ చేయడం ఈ విమర్శలకు అడ్డుకట్ట వేసేలా చేసింది.

Hardik Pandya Reacts for 1st Time to Natasa Stankovic s Post Amid Separation

ఇప్పటికైనా నటాషా స్టాంకోవిచ్ పట్ల విద్వేశాన్ని వ్యాప్తి చేయడం ఆపాలని ఓ యూజర్ రాసుకొచ్చాడు. వారి వ్యక్తిగత జీవితం వారిష్టమని, విడిపోవడం, కలిసి ఉండటం వారి వ్యక్తిగత నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదని పేర్కొన్నాడు. తమ విడాకులకు సంబంధించిన హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ సంయుక్త ప్రకటన చేశారు.

పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని పేర్కొన్నారు. 'నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా,నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం. కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం. ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో మధుర క్షణాల అనంతరం, కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే

ఆగస్త్య మా ఇద్దరితోనూ ఉంటాడు. అతని సంతోషం కోసం సహ తల్లిదండ్రులా మేం అండగా ఉంటాం. ఈ కష్టమైన సమయంలో మా గోప్యతకు సహకరించాలని, మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం'అని హార్దిక్, నటాషా ట్యాగ్ లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

Hardik Pandya Reacts for 1st Time to Natasa Stankovic s Post Amid Separation

ఏడేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో హార్దిక్-నటాషాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. 2018లో హార్దిక్ పాండ్య తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన వేడుక తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. ఓ ఏడాది తర్వాత హార్దిక్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో నటాషా పేర్కొంది. హార్దిక్‌కు కొనియాడుతూ పోస్ట్‌లు పెట్టింది. 2020 జనవరి 1న నటాషా ప్రేమను గెలుచుకున్నట్లు హార్దిక్ అధికారికంగా ప్రకటించాడు.

ఆ ఏడాది లాక్‌డౌన్‌లో తాము తల్లిదండ్రులు అయ్యామని తెలిపారు. 2020 జులైలో ఆగస్త్యకు జన్మనిచ్చారు. అయితే వారిద్దరు వివాహాన్ని మాత్రం ఆలస్యంగా చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 13న పెళ్లిచేసుకున్నారు.

Story first published: Wednesday, July 24, 2024, 22:29 [IST]
Other articles published on Jul 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+