టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. తన నయా గర్ల్ ఫ్రెండ్, మోడల్ మహికా శర్మతో పెళ్లి కాకుండానే కాపురం మొదలెట్టాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించకపోయినా.. సోషల్ మీడియా పోస్ట్‌లతో పరోక్షంగా వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
తాజాగా మహికా శర్మతో చనువుగా ఉన్న ఫొటోలను హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో కుమారుడు అగస్త్య ముందే మహికాతో హార్దిక్ రొమాన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఈ ఇన్‌స్టా పోస్ట్‌లో ఓ వీడియో కూడా ఉంది. ఇందులో హార్దిక్, మహికా శర్మ సంప్రదాయ దుస్తులు ధరించి పూజ చేశారు. ఈ వీడియోలో హార్దిక్.. మహికా శర్మ బుగ్గలపై ముద్దులు పెడుతూ కనిపించాడు. ఈ వీడియో, ఫొటోలు దివాళీ వేడుకలకు సంబంధించినవిగా తెలుస్తోంది. జిమ్‌లో దిగిన మరో ఫొటోలో మహికా శర్మను హార్దిక్ తన ఒడిలో ఎక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొడుకు ముందే రొమాన్స్ ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే.. హార్దిక్ లైఫ్ బాగుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మహికా శర్మతో కాపురం ఎన్నాళ్లు? అని ఇంకొందరు అడుగుతున్నారు.
ఆసియాకప్ 2025 టోర్నీలో గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్నాడు. జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఈ స్టార్ ఆల్‌రౌండర్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఓవైపు ఫిట్‌నెస్ సాధించేందుకు చెమటోడ్చుతూనే మరోవైపు మహికా శర్మతో సేద తీరుతున్నాడు. నటాషా స్టాంకోవిచ్‌తో కూడా సహజీవనం చేసిన తర్వాతే హార్దిక్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆగస్త్య పుట్టాడు. అయితే ఈ ఇద్దరూ విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. ఆగస్త్య మాత్రం కొన్నాళ్లు నటాషా దగ్గర.. ఇంకొన్నాళ్లు హార్దిక్ దగ్గర ఉంటున్నాడు.
నటాషాతో విడాకుల అనంతరం బ్రిటీష్ సింగర్, మోడల్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా ఆమెకు కూడా బ్రేకప్ చెప్పాడు. మహికా శర్మతో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఇద్దరూ పెళ్లి పీటలెక్కుతారా? లేక విడిపోతారా? అనేది చూడాలి.