Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండోసారి పెళ్లి.. తాగి చిందేసిన హార్దిక్ పాండ్యా-నటాషా!

 Hardik Pandya, Natasa Stankovic sizzle on dance floor in wedding after-party goes viral

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ రెండోసారి వివాహమడాడు. ప్రేమికుల దినోత్సవం(ఫిబ్రవరి 14) నాడు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహుతులతో పాటు కుమారుడు అగస్త్య సమక్షంలో హార్దిక్-నటాషా ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.


అయితే ఈ పెళ్లి వేడుక అనంతరం హార్దిక్ పాండ్యా-నటాషా తమ సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో పీకల్ దాక తాగిన హార్దిక్-నటాషా మైకంతో చిందేసారు. లోకం తెలియకుండా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో వీడియోలో పాండ్యా మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేసి పెళ్లికి వచ్చిన అతిథులను అలరింపజేశాడు. ఈ వేడుకలో యువరాణిలా మెరిసింది నటాషా.

రెండేళ్ల క్రితమే హార్దిక్ పాండ్యా-నటాషాకు వివాహం జరిగింది. లాక్‌డౌన్ సమయంలో సహజీవనం చేసిన ఈ ఇద్దరూ నటాషా గర్బం దాల్చిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌ ఇచ్చాడు హార్దిక్‌.

ఇక నటాషా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ... తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. మూడేళ్ల క్రితం చేసిన పెళ్లి ప్రమాణాలను మరోసారి గుర్తుచేసుకున్నామని.. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగడం సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనైంది. అయితే రెండోసారి పెళ్లి చేసుకొని హార్దిక్-నటాషా డబ్బులు వృథా చేశారని, ఎవరికైనా సాయం చేసినా బాగుండేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడుతుండటంతో బ్రేక్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా.. కుటుంబ సభ్యులతో ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీ20 టీమ్ సారథ్య బాధ్యతలు అందుకున్న హార్దిక్.. జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.

Story first published: Wednesday, February 15, 2023, 18:50 [IST]
Other articles published on Feb 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+