Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నూతన సంవత్సరం వేళ ఇనిస్టాలో ఫోటో: ఆమెతో రిలేషన్‌పిప్‌పై హార్దిక్ పాండ్యా

Hardik Pandya makes relationship with girlfriend Natasha Stankovicofficial with Instagram post

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గత కొంతకాలంగా సెర్బియా మోడల్‌ నటాషా స్టాన్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్య సంబంధంపై తాజాగా హార్దిక్ పాండ్యా స్పందించాడు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో పాండ్యా ఒక పోస్టు పెట్టాడు.

నటాషాతో దిగిన ఫొటోను

నటాషాతో దిగిన ఫొటోను

అందులో నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ "నా ఫైర్‌వర్క్‌తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం" అని కామెంట్ పెట్టాడు. నటాషా గురించి హార్దిక్ పాండ్యా చేసిన మొదటి కామెంట్ ఇది కావడం విశేషం. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో

తాజాగా ఈ వార్తలు నిజం చేస్తూ పాండ్యా తన ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో పెట్టాడు. గతంలో చాలామంది అమ్మాయిలతో హార్దిక్‌ పాండ్యా సంబంధాలను కొనసాగించాడు. అయితే, నటాషాతో తన సంబంధాన్ని పాండ్యా సీరియస్‌గా తీసుకున్నాడని, పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు.

నటాషాను ఇంటికి తీసుకెళ్లి

నటాషాను ఇంటికి తీసుకెళ్లి

గత ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా పాండ్యా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్‌ గర్ల్‌గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్‌ ఖాన్‌, అనుష్క నటించిన ‘జీరో' అనే సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది.

Sports Calendar of 2020: కివీస్ పర్యటన, ఐపీఎల్ 2020, టీ20 వరల్డ్‌కప్ ఒలింపిక్స్, యుఎస్ ఓపెన్ ఇలా!

‘నచ్‌ బలియే'లో కూడా

‘నచ్‌ బలియే'లో కూడా

దీంతో పాటు డ్యాన్స్‌ రియాలిటీ టీవీ షో ‘నచ్‌ బలియే'లో కూడా నటాషా పోటీ పడింది. ఈ షో నేపథ్యంలో అప్పట్లో నటాషాకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా హార్దిక్‌ పాండ్యా అభిమానులను కోరిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 1, 2020, 14:52 [IST]
Other articles published on Jan 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+