Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: హార్దిక్ సిక్సర్లు.. మహికా ముద్దులు!(వీడియో)

సౌతాఫ్రికాతో ఆఖరి టీ20కి హాజరైన తన ప్రియురాలు మహికా శర్మపై హార్దిక్ పాండ్యా ముద్దుల వర్షం కురిపించాడు. ప్రపంచాన్నే మరిచిపోయిన ఈ జోడీ మైదానంలోనే రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

కార్బిన్ బోష్ వేసిన 17వ ఓవర్‌లో వరుసగా 6, 4, 0, 6 బాదిన హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ అర్థశతకాన్ని హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. వీఐపీ గ్యాలరీలో కూర్చున్న తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మ వైపు ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చాడు.

Hardik Pandya Mahieka Sharma s romantic Moment Goes Viral During IND vs SA 5th T20I in Ahmedabad

మహికా శర్మ కూడా హార్దిక్ పాండ్యాపై ముద్దుల వర్షం కురిపించింది. మ్యాచ్ ఆసాంతం ఆమె హార్దిక్‌కు మద్దతుగా ఎగిరి గంతేసింది. ఈ సన్నివేశాలు టీవీలో కనిపించాయి. మైదానంలో వీరి రొమాన్స్ చూసి ప్రేక్షకులు, కామెంటేటర్లు, ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఈ మ్యాచ్‌కు ఇది హైలైట్‌గా నిలిచింది. నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చిన అనంతరం మహికా శర్మతో హార్దిక్ పాండ్యా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

హార్దిక్ కొట్టిన సిక్స్ కెమెరామెన్‌ భుజానికి బలంగా తాకింది. దాంతో తన బ్యాటింగ్ అనంతరం సదరు కెమెరామెన్‌ను కలిసిన హార్దిక్ పాండ్యా.. అతని గాయంపై ఆరా తీయడంతో పాటు హగ్ చేసుకున్నాడు. క్షమాపణలు కూడా చెప్పాడు. అదృష్టవశాత్తు బంతి భుజానికి తాకిందని, కొంచెం పైకి తగిలినా పరిస్థితి దారుణంగా ఉండేదని హార్దిక్ పాండ్యాతో పాటు కెమెరామెన్ అన్నాడు. ఈ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) అదిరిపోయే ఆరంభాన్ని అందించగా.. తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్, జార్జ్ లిండే తలో వికెట్ తీసారు.

అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్వింటన్ డికాక్(35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(4/53) నాలుగు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా..అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా(2/17) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, December 20, 2025, 10:08 [IST]
Other articles published on Dec 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+