
బేసిక్స్‌కు కట్టుబడి..
‘ఈ మ్యాచ్‌ను విజయంతో ముగిస్తామని నేను గట్టిగా నమ్మాను. కాకపోతే కాస్త ఆలస్యమైంది. ఈ తరహా మ్యాచ్‌ల్లో ప్రతీ క్షణం ముఖ్యమే. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. ఒత్తిడికి గురవ్వడం కంటే సింగిల్స్‌తో స్ట్రైక్‌రొటేట్ చేయడం ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేం చేసింది అదే. మా బేసిక్స్‌ను అనుసరించి ఫలితం సాధించాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ పిచ్ షాక్‌కు గురి చేసింది. గత మ్యాచ్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కఠిన పిచ్‌లపై ఆడటం నాకేం ఇబ్బంది కాదు. కానీ ఈ రెండు పిచ్‌లు టీ20లకు ఏ మాత్రం సరిపోయేవి కావు. క్యూరేటర్లు పిచ్‌లు తయారు చేయడంపై శ్రద్ద వహించాలి. ముందుగానే పిచ్‌లను సిద్దం చేయాలి. ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది.

బౌలర్లు అద్భుతంగా..
ఈ వికెట్‌పై 120 పరుగులను కూడా కాపాడుకోవచ్చు. కానీ మా బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ న్యూజిలాండ్‌ను దెబ్బతీసారు. స్ట్రైక్ రొటేట్ చేయకుండా అడ్డుకున్నారు. మేం తరుచూ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో తేమ ప్రభావం ఏ మాత్రం లేదు. న్యూజిలాండ్ బౌలర్లు మా కంటే ఎక్కువ బంతిని స్పిన్ చేశారు. వికెట్‌పై ఉన్న అడ్వాంటేజ్‌ను వాడుకున్నారు. మొత్తానికి ఈ పిచ్ మాత్రం మమ్మల్ని షాక్‌కు గురి చేసింది.

చెలరేగిన స్పిన్నర్లు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(19 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 101 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్‌తో 26 నాటౌట్), హార్దిక్ పాండ్యా(20 బంతుల్లో ఫోర్‌తో 15 నాటౌట్) కడవరకు నిలిచి భారత్ థ్రిల్లింగ్ విక్టరీ అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్‌వెల్, ఇష్ సోదీ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాయి. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్1-1తో సమం చేసింది. ఆఖరి మ్యాచ్ బుధవారం(ఫిబ్రవరి) అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications
