కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యాకు భారీ ఊరట.. ఆ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు భారీ ఊరట లభించింది. 'కాఫీ విత్ కరణ్' షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ ఇద్దరిని జోధ్‌పూర్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరితో పాటు షో హోస్ట్, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌కు కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించింది. 2018లో కాఫీ విత్ కరణ్ షో సీజన్ 6 సందర్భంగా షో హోస్ట్ కరణ్ జోహర్ అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు (సెక్స్ లైఫ్) రాహుల్, పాండ్యాలు జుగుప్సాకరమైన సమాధానాలు ఇచ్చారు.

తీవ్ర దుమారం..
అప్పట్లో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. సర్వత్రా విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ వారిపై చర్యలు కూడా తీసుకుంది. జట్టు నుంచి అర్థంతరంగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి రప్పించింది. అంతటితోనే ఆగకుండా వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. ఈ ఇద్దరు క్రికెటర్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పినా.. విమర్శలు పర్వం ఆగలేదు. ఈ విషయమై డాక్టర్ మేఘ్ వాల్.. రాహుల్, హార్థిక్ సహా కరణ్ జోహర్‌లపై జోధ్‌పూర్‌లోని లునీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని..
దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఆ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కోర్టు ఈ కేసును కొట్టేసింది. కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు టీమిండియాలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పాండ్యా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాలో భాగంగా ఉంటే, ఇటీవలే గాయం నుంచి కోలుకుని రాహుల్ ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాడు.

మహిళలను కించపరిచేలా..
'కాఫీ విత్ కరణ్' షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి 'ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications