Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాక్షి ధోనీ పుట్టినరోజు వేడుకల్లో తళుక్కుమన్న పాండ్యా (వీడియో)

Hardik Pandya joins MS Dhoni and Ziva to celebrate Sakshis birthday

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య 30వ పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో ఒకరోజు ముందుగానే జరుపుకున్నారు. సాక్షి పుట్టినరోజు నవంబరు 19కాగా ప్రత్యేక కారణాల రీత్యా ఆదివారమే జరిపారు. ఈ బర్త్ డే పార్టీకి టీమిండియా క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా ఒక్కడే హాజరైయ్యాడు. ఇప్పటికే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం బ్రిస్బేన్ చేరుకోవడంతో అందుబాటులో ఉన్న పాండ్యా మాత్రమే పార్టీలో మెరిశాడు. తల్లి పుట్టినరోజు పార్టీలో కూడా జీవానే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

టీ20కు దూరమైన పాండ్యా, ధోనీలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాటల కార్యక్రమంలో బాలీవుడ్ ప్లేబాక్ సింగర్ రాహుల్ వైద్య తన పాటలతో అలరించాడు. ఈ క్రమంలో సింగర్‌తో పాటుగా పాండ్యా.. సాక్షిలు కూడా గొంతు కలిపారు. ధోనీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపిక కాకపోవడంతో విరామంలో ఉన్నాడు. ధోనీతో పాటుగా పాండ్యా సైతం అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. అతని స్థానంలో కృనాల్‌ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

'ధోనీ 20 ఏళ్ల కుర్రాడేం కాదు.. ఆశించడం మానేయండి'

 చిన్ననాటి స్నేహితులే

చిన్ననాటి స్నేహితులే

సాక్షి పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించిన కొన్ని ముఖ్య విషయాలు. మిస్టర్ కూల్ జూలై 4, 2010 న సాక్షిని సతీమణిగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. నవంబరు 19, 1986న జన్మించిన సాక్షి.. డెహ్రాడూన్ లో వెల్హామ్ గర్ల్స్ స్కూల్ లో స్కూలింగ్ చేశారు. ఆమె తండ్రి కనోయి గ్రూప్ యొక్క బినాహరి టీ సంస్థలో ఉద్యోగి. ఔరంగబాద్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందింది.

కోల్‌కతాలోని తాజ్ హోటల్‌లో మరోసారి

కోల్‌కతాలోని తాజ్ హోటల్‌లో మరోసారి

చిన్ననాటి స్నేహితులైన ధోని, సాక్షిల పరిచయం రాంచీలోని DAVశ్యామలీ పాఠశాలలో మొదలైంది. అప్పటి నుంచే ధోనీ.. సాక్షిల కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉండేవి. కొంత కాలం తర్వాత సాక్షి కుటుంబం ఉద్యోగ రీత్యా డెహ్రాడూన్‌కి వెళ్ళిపోయింది. హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాక్షి.. 2007లో ఇండియన్ క్రికెట్ జట్టు కోల్‌కతాలోని తాజ్‌లో ఉంటున్న సమయంలో సాక్షి,ధోనీ మళ్లీ కలుసుకున్నారు.

ఖాళీ సమయాల్లో ధోనీ కాలక్షేపమంతా

ఖాళీ సమయాల్లో ధోనీ కాలక్షేపమంతా

సాక్షి ఇంటర్న్ షిప్‌కు అదే చివరి రోజు. ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్-పాకిస్తాన్‌పై మ్యాచ్‌ జరిగిన రోజు. చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి 2010 లో డెహ్రాడూన్ సమీపంలోని విక్రాంతి రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు. వారి సంతానంగా పుట్టిన జీవాతోనే ఖాళీ సమయాల్లో ధోనీ కాలక్షేపమంతా. ధోని తన కూతురు తన జీవితంలోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయని చెప్తూ ఉంటాడు.

Story first published: Monday, November 19, 2018, 15:10 [IST]
Other articles published on Nov 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+