IPL 2022: హార్దిక్ పాండ్యాకు మళ్లీ గాయం.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన గుజరాత్ కెప్టెన్!

ముంబై: వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోని ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటుతున్న హార్దిక్ పాండ్యా మళ్లీ గాయపడ్డాడు. సూపర్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్, బౌలింగ్‌లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా ఒకప్పటి హార్దిక్‌ను తలపిస్తున్నాడు. దాంతో అతను టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ముందు పాండ్యా రిథమ్ అందుకోవడం భారత జట్టుకు శుభపరిణామమని క్రికెట్ల విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
హార్దిక్‌కు గాయం..?
అయితే రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఉన్నట్టుండి మైదానం వీడాడు. బౌలింగ్ చేస్తూ ఓవర్ మధ్యలోనే వదిలేసి అసౌకర్యంగా కనిపించిన హార్దిక్ పాండ్యా నేరుగా డగౌట్‌లోని ఫిజియోల దగ్గరకు వెళ్లాడు. దాంతో హార్దిక్ పాండ్యా మళ్లీ గాయపడ్డాడా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే వేసిన హార్దిక్ పాండ్యా.. ఉన్నట్టుండి ఫీల్డ్‌ను విడిచి పెట్టాడు.

కండరాలు పట్టేయడంతో..
ఈ ఓవర్‌లో హార్ధిక్ రెండో బంతికే జిమ్మీ నీషమ్ వికెట్ పడగొట్టి మ్యాచ్‌ను గుజరాత్ వైపు పూర్తిగా తిప్పేశాడు. అయితే గజ్జ గాయం కారణంగా అతడు ఫీల్డ్‌ను విడిచి పెట్టినట్లు అనిపించింది. మిగితా ఓవర్‌ను విజయ్ శంకర్ పూర్తి చేశాడు. అయితే విజయానంతరం తన గాయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. అంత తీవ్రమైనది కాదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం క్రాంప్స్ మాత్రమేనని చెప్పాడు. కండరాలు పట్టేయడంతోనే మైదానం వీడానని వివరణ ఇచ్చాడు.

చిన్న గాయమే..
'నాకు ఎలాంటి గాయం కాలేదు. కండరాలు పట్టేయడంతోనే మైదానం వీడాను. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి చాలా రోజులు అయింది. ఈ రోజు నాకు రిథమ్ లభించింది. దాంతో ప్రణాళిక పరంగా ఆడాను. బ్యాటింగ్‌లో నా ప్రదర్శన కారణంగా ఇతర ఆటగాళ్లు స్వేచ్చగా ఆడారు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి 12 బంతుల్లో 30 పరుగులు చేయాలంటే కష్టం. కానీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో గేమ్‌ను కంట్రోల్ చేయగలుగుతున్నాను. కెప్టెన్సీ ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. జట్టుకు ఫ్లాగ్ బేరర్‌గా ఉండాలి. మా టీమ్ కూడా అద్భుతంగా రాణిస్తుంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications