Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తిలక్ వర్మకు చెప్పింది అదే.. బుమ్రా ఎప్పుడూ తోపే: హార్దిక్ పాండ్యా

బంతిని చూసి బాదాలని మాత్రమే తిలక్ వర్మకు చెప్పానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అతను అద్భుతమైన సెంచరీతో అదరగొట్టేసాడని కొనియాడాడు. జస్‌ప్రీత్ బుమ్రా కంటే మెరుగైన బౌలర్ ఈ ప్రపంచంలోనే లేడని హార్దిక్ పాండ్యా ప్రశంసించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శనతో రాణించారని, అహ్మాదాబాద్ కోటను బద్దలు కొట్టామని సంతోషం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ(45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ శతకంతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో తిలక్ వర్మతో గట్టిగా అరుస్తూ హార్దిక్ పాండ్యా ఏదో చెప్పాడు. అప్పటి వరకు స్లోగా ఆడిన తిలక్ వర్మ.. హార్దిక్ మాటలతో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి గుజరాత్ టైటాన్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

Hardik Pandya Hails Tilak Varma s Ton and Youngsters for Breaking MI s Losing Streak in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

నేను చెప్పింది ఒక్కటే..

ఈ విజయానంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. బంతిని చూసి బాదాలని మాత్రమే తిలక్‌కు చెప్పానని వెల్లడించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. 'ఈ విజయం మాకు చాలా ముఖ్యం. బయట గ్రౌండ్స్‌లో గెలవడం ఎప్పుడూ సవాలే. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో గెలవడం ముంబై ఇండియన్స్‌కు ఎప్పుడూ కష్టంగా ఉండేది. ఈరోజు మంచి క్రికెట్ ఆడి అహ్మదాబాద్ కోటను మేం బద్దలు కొట్టాం.

తిలక్ లాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. నేను అతనికి ఒకటే చెప్పాను.. 'బంతిని చూడు, బాదు.. అంతే'. అతని బ్యాట్ నుంచి వచ్చే స్ట్రోక్స్ చాలా స్పెషల్. అతను ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే సమయం ఎప్పుడో వచ్చేసింది. నేను మైదానంలో ఎంత గట్టిగా అరిచానంటే.. నాకు కళ్లు తిరిగినంత పని అయింది. ఈ ఎనర్జీ తిలక్ వర్మతో పాటు ముంబై ఇండియన్స్‌కు చాలా అవసరం.

బుమ్రా ఎప్పుడూ తోపే..

జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం అద్భుతం. బుమ్రా ఎందుకు తొలి ఓవర్ వేయడు అని చాలామంది అడుగుతుంటారు. కానీ అతని 151 మ్యాచ్‌ల కెరీర్‌లో కేవలం 8- 9 సార్లు మాత్రమే మొదటి ఓవర్ వేశాడు. ఇది నా నిర్ణయం వల్ల కాదు, బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలర్. అతన్ని జట్టుకు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. కానీ ఈరోజు కొత్త బంతితో ప్రభావం చూపాలని అతనికి ఇచ్చాం. అతనికంటే మెరుగైన బౌలర్ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు.

ఇది మా పర్ఫెక్ట్ గేమ్. మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ముంబై ఇండియన్స్‌కు ఈ ఎనర్జీ కావాలి. అరంగేట్రం చేసిన క్రిష్ సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. అశ్విని కుమార్ గత ఏడాది లాగే ఈసారి కూడా 4 వికెట్లతో చెలరేగి మూమెంటమ్ అందించాడు. కేకేఆర్ మ్యాచ్ నుంచి మాకు పరిస్థితులు మారుతున్నాయి. ఫీల్డింగ్ కూడా బాగుంది. నమన్‌ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. ఈ గెలుపు మా ప్రయణాన్ని మలుపు తిప్పుతుంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, April 21, 2026, 0:40 [IST]
Other articles published on Apr 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+