Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓయ్ హార్దిక పాండ్యా.. పరుగులు చేయాలంటే నొప్పులు వస్తున్నాయా?

Hardik Pandya Failure Continues In SL Tour Worries Indian Fans

హైదరాబాద్: శ్రీలంక గడ్డపై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో ఈ బరోడా క్రికెటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు హార్దిక్ పాండ్యా ఫామ్ భారత క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా లాంటి హిట్టింగ్ సామర్థ్యం ఉన్న పేస్ ఆల్‌రౌండర్ భారత్‌కు చాలా అవసరం. ఆ నేపథ్యంలోనే వరుసగా విఫలమవుతున్నా హార్దిక్ పాండ్యాకు ప్రతీ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో పేలవ ప్రదర్శన కబనబర్చిన హార్దిక్.. తాజాగా తొలి టీ20లోనూ చేతులెత్తేసాడు. దాంతో హార్దిక్ పాండ్యాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hardik Pandya Sings Sri Lanka National Anthem - Video Viral | IND VS SL | Oneindia Telugu

నాలుగు మ్యాచ్‌ల్లో 29 రన్స్

మూడు వన్డేల సిరీస్‌లో 19 పరుగులే చేసిన పాండ్యా.. ఫస్ట్ టీ20లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 12 బంతుల్లో 10 పరుగులే చేశాడు. వాటిని కూడా చాలా ఇబ్బంది పడుతూ సాధించాడు.

తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. మూడో వన్డేలో 19 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక బౌలింగ్‌లోనూ తీవ్రంగా నిరాశ పరిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో రెండు వికెట్లు తీసిన హార్దిక్.. తాజా టీ20లో ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ధారళంగా పరుగలిచ్చుకున్నాడు. అంతేకాకుండా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

ఇలా అయితే కష్టం..

ఈ తరహా ప్రదర్శన కనబరిస్తే అటు హార్దిక్ పాండ్యా‌తో పాటు టీమిండియాకు కష్టాలు తప్పవు. ఇప్పటికిప్పుడు హార్దిక్ పాండ్యా స్థాయి హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ఆల్‌రౌండర్ భారత జట్టుకు దొరకడం కష్టమే. టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండర్లది కీలక పాత్ర. పాండ్యాలాంటి ఆల్‌రౌండర్ జట్టులో ఉంటే టీమ్ కాంబినేషన్‌తో బౌలర్లను వినియోగించడంలో కెప్టెన్‌కు సులువవుతుంది. పరిస్థితులకు తగ్గట్లు ఎక్స్‌ట్రా బౌలర్‌తో పాటు బ్యాట్స్‌మన్‌ను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ మూల్యం చెల్లించుకుంది. కాబట్టి పాండ్యా గాడిలో పడటం టీమిండియా అత్యవసరం.

నొప్పులొస్తున్నాయా?

ఇక హార్దిక్ పాండ్యా ప్రదర్శన పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ టీ20లో అతని బ్యాటింగ్ మరీ పేలవంగా ఉందని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 12 బంతులు ఆడిన పాండ్యా ఒక్క బౌండరీ కొట్టకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నారు. ఎంతటి బౌలర్లనైనా అలవోకగా ఆడే పాండ్యా.. బలహీనమైన శ్రీలంకపై తడబడుతుంటం తమను విస్మయానికి గురిచేస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఆ పది పరుగులు తీయడానికి కూడా పాండ్యా చాలా ఇబ్బంది పడ్డాడని, పురిటి నొప్పులు వచ్చినోడిలా తెగ ఆయాసపడ్డాడని విమర్శిస్తున్నారు.

ఓవర్‌రేటేడ్ ప్లేయర్..

ఇంకొందరైతే పాండ్యా స్థాయికి మించిన పేరు, ప్రశంసలు అందుకున్నాడని, అతనో ఓవర్ రేటేడ్ ప్లేయర్ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. మైదానంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ కటౌట్ ఏర్పాటు చేయాలనే అప్పుడే పాండ్యా ఫామ్‌లోకి వస్తాడని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. మాజీ క్రికెటర్లు సైతం హార్దిక్ పాండ్యా ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పాండ్యా ఫామ్ అందుకోవాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్ వేదికగా ఆకాంక్షించాడు. తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్(50) సూపర్ ఫిఫ్టీ భువనేశ్వర్ కుమార్(4/24) అద్భుత బౌలింగ్‌తో భారత్ 38 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

Story first published: Monday, July 26, 2021, 17:34 [IST]
Other articles published on Jul 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+