For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కంటతడి పెట్టిస్తోన్న హార్దిక్ పాండ్యా భావోద్వేగపూరిత పోస్ట్!!

Hardik Pandya emotional note for late father Himanshu Pandya

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. పాండ్యా బ్రదర్స్ త్రండి హిమాంశు పాండ్యా శనివారం గుండె పోటుతో మరణించారు. ఆరోజు హార్దిక్ ఇంటివద్దే ఉండగా.. కృనాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలిసిన కృనాల్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాడు. తండ్రి మరణం నేపథ్యంలో హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగపూరిత పోస్ట్ చేశాడు. ప్రేమతో తన తండ్రికి సందేశాన్ని ఇస్తున్న ఆ పోస్ట్ ఫాన్స్, నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

నాన్న.. నా హీరో:

నాన్న.. నా హీరో:

'నాన్న.. నా హీరో. మిమ్మల్ని కోల్పోవడం నా జీవితంలో అత్యంత కఠినమైన విషయం. కానీ మాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చారు. మీరెప్పుడూ మా జ్ఞాపకాల్లో నవ్వుతూనే ఉంటారు. మేం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం.. మీరు, మీ శ్రమ, మీ నమ్మకమే. మీరు లేని ఇల్లు ఎంతో బోసిగా ఉంటుంది. మిమ్మల్ని మేం ఎంతో ప్రేమిస్తున్నాం.. ప్రేమిస్తుంటాం. మీ పేరు, ప్రతిష్ఠలను కాపాడుతాం' అని హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

లవ్ యూ డాడీ:

'నేను ఒక్కటి నమ్ముతున్నా. ఇన్నేళ్లు మా గురించి ఆలోచించినట్లుగానే పైనుంచి కూడా మమ్మల్ని చూస్తుంటారని ఆశిస్తున్నా. మీరంటే మాకు ఎంతో గర్వకారణం. మీ జీవితాన్ని గడిపిన తీరును చూసి ఎంతో గర్వపడుతుంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ప్రతి రోజు మిమ్మల్ని మిస్‌ అవుతాను. లవ్ యూ డాడీ!' అని హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. హార్దిక్, కృనాల్ అంతర్జాతీయ క్రికెటర్లగా ఎదగదడానికి హిమంశు ఎంతో కష్టపడ్డారు. ఇద్దరికీ క్రికెట్ నేర్పించడం నుంచి టీంఇండియాలో కీలక ఆటగాళ్లుగా ఎదిగే వరకు అండగా ఉన్నారు.

ఇంగ్లండ్‌ సిరీస్ కోసం ప్రాక్టీస్:

ఇంగ్లండ్‌ సిరీస్ కోసం ప్రాక్టీస్:

గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 57 వన్డేలు, 43 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 1167, పొట్టి క్రికెట్‌లో 388 పరుగులు చేశాడు. 2019 సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్ 2020లో అదరగొట్టాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు.

18 టీ20లు మాత్రమే‌:

18 టీ20లు మాత్రమే‌:

భారత క్రికెట్‌ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌‌గా హార్దిక్‌ పాండ్యా కొనసాగుతుండగా.. కృనాల్‌ పాండ్యా మాత్రం అడపాదడపా అవకాశాలకే పరిమితం అయ్యాడు. హార్దిక్‌ తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగితే.. కృనాల్‌ మాత్రం ఇంకా అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాడు. కృనాల్‌ ఒక పెద్ద సక్సెస్‌ కోసం పరితపిస్తూ టీ20లకే పరిమితమయ్యాడు. 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కృనాల్ 121 పరుగులు చేశాడు.

మెరిసిన సిరాజ్.. లంచ్‌ విరామానికి ఆసీస్‌ 149/4!! ఆధిక్యం 182!

Story first published: Monday, January 18, 2021, 9:31 [IST]
Other articles published on Jan 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+