Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో అమ్మాయితో హార్దిక్ పాండ్యా డేటింగ్.. బాంబు పేల్చిన నటాషా!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా తన సతీమణి నటాషా స్టాంకోవిచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉంటున్నాడు. ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని జోరుగా ప్రచారాం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై హార్దిక్-నటాషాలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ ఇద్దరి వ్యవహారం విడాకుల వార్తలకు బలం చేకూర్చుతోంది.

ఐపీఎల్ 2024 సీజన్ కంటే ముందు నుంచే ఈ ఇద్దరూ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతీ ఐపీఎల్ సీజన్‌కు హాజరైన నటాషా స్టాంకోవిచ్.. ఐపీఎల్ 2024 సీజన్‌లో మాత్రం కనిపించలేదు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తన పేరు చివరన ఉన్న పాండ్యాను తొలగించింది. మార్చి 4న నటాషా స్టాంకోవిచ్ పుట్టినరోజు కాగా.. హార్దిక్ ఆమెకు విషెస్ కూడా తెలియజేయలేదు.

Hardik Pandya Dating Mystery Girl Amid Natasa Stankovic Divorce Rumours

టీ20 ప్రపంచకప్ 2024 సమయంలోనూ నటాషా కనిపించలేదు. ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం సాధించి 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ ఐసీసీ టైటిల్ సాధించింది. ఈ విషయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. కానీ తన భర్త విజయం గురించి నటాషా ఎక్కడా కామెంట్ చేయలేదు.

ఇంటికొచ్చిన హార్దిక్ పాండ్యా.. తన కొడుకు మెడలో టీ20 ప్రపంచకప్ మెడల్ వేసాడు. ఆ సమయంలోనూ నటాషా కనిపించలేదు. అంబానీ ఇంట వివాహానికి కూడా హార్దిక్ పాండ్యా ఒక్కడే హాజరయ్యాడు. దాంతో ఈ ఇద్దరూ విడిపోయారనే విషయం స్పష్టమైంది.

భుజాలపై చేతులేసి..
తాజాగా హార్దిక్ పాండ్యా.. ఓ అమ్మాయితో చనువుగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె భుజాలపై చేయి వేసి మరి హార్దిక్ ఫొటో దిగాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి హార్దిక్ పాండ్యా కుటుంబ సభ్యులతో చనువుగా ఉన్న ఫొటోలను కూడా పంచుకుంది. దాంతో ఆ అమ్మాయి ఎవరా? అనేది నెటిజన్లు ఆరా తీసారు.

ఆమె పేరు ప్రాచీ సోలంకి అని, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌, మేకప్ ఆర్టిస్ట్ అని ప్రచారం జరుగుతోంది. చూడటానికి అమ్మాయి హీరోయిన్‌లా ఉండటంతో హార్దిక్ పాండ్యా.. నటాషాకు రిప్లేస్‌మెంట్‌ను తెచ్చుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రియాంక సోలంకిని పెళ్లి చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు.

Hardik Pandya Dating Mystery Girl Amid Natasa Stankovic Divorce Rumours

బాంబు పేల్చిన నటాషా..
మరోవైపు నటాషా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 'ఒకరు రోడ్డున పడబోతున్నారు.'అని ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోను షేర్ చేశారు. అయితే ప్రియాంక సోలంకి ఫొటోను ఉద్దేశించే నటాషా ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

నటాషా మరో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసింది.'జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. నిరుత్సాహపడతాం. అలాంటివేళ ఎవరూ తోడుగా లేరని బాధ పడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దానిగురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది'అంటూ నటాషా ఓ వీడియోను పంచుకుంది.

Story first published: Friday, July 12, 2024, 18:11 [IST]
Other articles published on Jul 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+