Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ చెప్పిన ఆ ఒక్క మాటతోనే ఈ విజయం: హార్దిక్ పాండ్యా

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే తాను బ్యాటింగ్‌‌లో రాణించగలిగానని టీమిండియా తాత్కలిక సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

సమష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధించామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్.. కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఇది ప్రత్యేకమైన విజయం. నిజాయితీ‌గా చెప్పాలంటే ఓ కెప్టెన్‌గా ఇలాంటి మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాంటి డూఆర్‌డై మ్యాచ్‌లు అంతర్జాతీయ స్థాయి కంటే ఎక్కువ.

Hardik Pandya credits Virat Kohli for imporved batting performance in 3rd ODI against West Indies

ఈ మ్యాచ్‌లు ఎంత ప్రమాదమో మాకు తెలుసు. ఓడితే అందరం బాధపడేవాళ్లం. మా కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. కఠిన పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని ఆస్వాదించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో అంతర్భాగం. అయితే రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వారికి విశ్రాంతి ఇవ్వక తప్పలేదు. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే సదుద్దేశంతోనే వారికి రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌కు ముందు విరాట్‌తో మాట్లాడాను. అనుభవంతో అతను ఇచ్చిన సలహా నాకు బాగా ఉపయోగపడింది. మిడిల్‌లో కాస్త టైమ్ తీసుకొని ఆడాలని విరాట్ సూచించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు అలవాటు పడాలని కోరాడు. కోహ్లీ తన అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. ఒక బంతిని హిట్ చేసి రిథమ్ అందుకుంటే పరిస్థితులన్నీ చాలా భిన్నంగా ఉంటాయి.

350 పరుగులు స్కోర్ ఎప్పుడూ కీలకమే. ఇలాంటి లక్ష్యం ఉంటే బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. లక్ ఉంటే లక్ష్యాన్ని అందుకుంటారు. లేదంటే ఫీల్డింగ్ టీమ్‌కు కలిసొస్తుంది. గిల్ అసాధారణమైన క్యాచ్‌లు అందుకున్నాడు. వెస్టిండీస్ చాలా ఆలస్యంగా మేల్కొంది. ఆ భాగాస్వామ్యం మ్యాచ్‌ను 34వ ఓవర్ వరకు తీసుకెళ్లింది.

పవర్ ప్లేలోనే గేమ్ దాదాపు ముగిసింది. కానీ టెయిలెండర్స్ పోరాడారు. మేం ఆడిన మైదానాల్లో ఇది అద్భుతమైనది. మరోసారి వెస్టిండీస్ పర్యటనకు వచ్చినప్పుడు పరిస్థితులన్నీ చక్కబడుతాయని ఆశిస్తున్నా. ప్రయాణం వంటి విషయాల్లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుందని అనుకుంటున్నా.

మేం ఏం లగ్జరీ అడగడం లేదు. మాకు అసౌకర్యం కలగకుండా ప్రాథమిక అవసరాలు తీర్చాలి.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది.

ఇషాన్ కిషన్(64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లతో 85), సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లతో 85), సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Wednesday, August 2, 2023, 7:50 [IST]
Other articles published on Aug 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+