Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1500 ప్లస్ రన్స్, 50 ప్లస్ వికెట్లతో పాటు ఐదు కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో పుణె వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. శివమ్ దూబేతో కలిసి 6వ వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. హార్దిక్ పాండ్యాకు ఇది 5వ టీ20 హాఫ్ సెంచరీ. టీ20ల్లో హార్దిక్ 1803 పరుగులకే చేరుకున్నాడు. బౌలింగ్‌లో 94 వికెట్లు తీసాడు. ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో ఈ రేర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా కంటే ముందు షకీబ్ అల్ హసన్, మహమ్మద్ నబీ, సికిందర్ రాజా ఈ ఫీట్ సాధించారు.

Hardik Pandya Creates History After He Scored Fifty in India vs England 4th T20I

టీ20ల్లో మరో 6 వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా 100 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు. అంతేకాకుండా 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా రికార్డ్ సాధిస్తాడు. షకీబ్ అల్ హసన్ ఇప్పటికే ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రింకూ సింగ్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), అభిషేక్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29)పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(3/35) మూడు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్(2/32) రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.

Story first published: Friday, January 31, 2025, 22:08 [IST]
Other articles published on Jan 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+