Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘మామ నాకు 30 ఏళ్లు వచ్చేసాయ్’.. గంభీర్‌తో హార్దిక్ పాండ్యా బర్త్‌డే సెలెబ్రేషన్స్! (వీడియో)

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నేడు(అక్టోబర్ 11)తో 30వ జన్మదినం జరుపుకుంటున్నాడు. కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్ బర్త్‌డే రోజు మ్యాచ్ ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ జతిన్ సప్రుతో కలిసి హార్దిక్ కేక్ కట్ చేశాడు.

ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు 30 ఏళ్లు వచ్చాయని, దీన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉందని చెబుతూ నవ్వులు పూయించాడు. తన గాయానికి సంబంధించిన అప్‌డేట్‌తో పాటు గత మ్యాచ్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Hardik Pandya Celebrates 30th Birthday With Gautam Gambhir

'నా సహచర ఆటగాళ్లందరికి ఈ రోజు నా బర్త్‌డే అని తెలుసు. గత రాత్రితో పాటు ఈ ఉదయం నాకు చాలా మంది విషెస్ చెప్పారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. పరుగులు చేయకుండా వారిని ఒత్తిడిలోకి నెట్టాం. పరిస్థితులను చక్కగా వాడుకొని అడ్వాంటేజ్ పొందాం.
చేజింగ్‌లో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాం.

కానీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌తో ఒత్తిడిని అధిగమించారు. గాయం కారణంగా ఆ మ్యాచ్‌లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. ప్రస్తుతం బాగానే ఉంది. వేలికి బంతి బలంగా తాకడంతో బ్లడ్ క్లాట్ అయ్యింది. ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతు చూస్తుంటే స్పెషల్ ఫీలింగ్ కలుగుతోంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది.

ఈ బర్త్‌డే‌ను పెద్దగా సెలెబ్రేట్ చేసుకోలేదని చెప్పిన హార్దిక్ పాండ్యా.. నిద్ర లేవగానే తన కొడుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని తెలిపాడు. తాను సొంతంగా తయారు చేసిన ఓ బోర్డును తనకు గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇది తనకు సర్‌ప్రైజని చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్‌ చేస్తుండగా.. బర్త్‌డే బాయ్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసాడు. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్(21)ను క్యాచ్ ఔట్ చేసిన హార్దిక్ పాండ్యా.. హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన అజ్మతుల్లా ఒమార్జై(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

40 ఓవర్లు పూర్తయ్యే సరికి అఫ్గాన్ 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. క్రీజులో హష్మతుల్లా షాహిది(70 బ్యాటింగ్), మహమ్మద్ నబీ(9 బ్యాటింగ్) ఉన్నారు. మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జడ్రాన్‌(22)ను బుమ్రా ఔట్ చేయగా.. రెహ్మత్‌షా(16)ను లార్డ్ శార్దూల్ ఠాకూర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు

Story first published: Wednesday, October 11, 2023, 17:32 [IST]
Other articles published on Oct 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+