For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya కెరీర్ ముగిసినట్లేనా? టీమిండియా నయా ఆల్‌రౌండర్‌ వెంటకటేశ్ అయ్యరా?

Hardik Pandya Career As Indian Cricketer Is Over, Venkatesh Iyer Is The New All Rounder To Team India
Hardik Pandya కు చెక్.. Venkatesh Iyer ఆడగలడా? All Rounder, ఫినిషర్ గా సవాల్‌ || Oneindia Telugu

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వేటు వేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఊహించినట్లుగానే రోహిత్ శర్మకు టీ20 సారథ్యబాధ్యతలు అప్పగించిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానన్న విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ బౌలర్లు బుమ్రా, షమీ, జడేజాలకు విశ్రాంతినిచ్చింది. సీనియర్ల గైర్హాజరీలో ముగ్గురు కొత్త ప్లేయర్లను టీ‌మ్‌లో అవకాశం కల్పించింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్)‌తో పాటు ఈ ఐపీఎల్ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలచిన హర్షల్ పటేల్(ఆర్‌సీబీ), అవేశ్ ఖాన్(ఢిల్లీ క్యాపిటల్స్)‌ను ఎంపిక చేసింది.

హార్దిక్ పాండ్యాకు చెక్..

హార్దిక్ పాండ్యాకు చెక్..

హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోయినా.. టీ20 ప్రపంచకప్ వరకు అతనికి అండగా నిలిచిన బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ.. మెగా టోర్నీలో ఘోర వైఫల్యం అనంతరం అతనిపై వేటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాను కేవలం బ్యాటర్‌గా జట్టులో కొనసాగించడం అనవసరమని సెలెక్టర్ల భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌలింగ్‌ చేసే సామర్థ్యం కలిగిన బ్యాట్స్‌మన్‌ను రెడీ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్‌లను కాదని వెంకటేశ్ అయ్యర్‌‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఓపెనర్ అయినటు వంటి వెంకటేశ్ అయ్యర్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా మార్చేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి వెంకటేశ్ అయ్యర్‌తో హార్దిక్ పాండ్యాకు చెక్ పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పాండ్యా కెరీర్ ముగిసినట్లేనా?

పాండ్యా కెరీర్ ముగిసినట్లేనా?

ఇక వెంకటేశ్ అయ్యర్ రాకతో హార్దిక్ పాండ్యా కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2017లో అతనికి అయిన వెన్ను గాయం హార్దిక్ కెరీర్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత మునపటి ఫామ్ చూపలేకపోయిన పాండ్యా గాయాలతో సతమతమయ్యాడు. జట్టులోకి వస్తూ పోతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి అండగా నిలిచిన రాణించలేకపోయాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనే బౌలింగ్ ప్రారంభించినా.. అది జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. శ్రీలంక పర్యటన, ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన పాండ్యాను టీ20 ప్రపంకప్‌కు ఎంపిక చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి.

 ద్రవిడ్ ప్లాన్‌లో భాగంగానే..

ద్రవిడ్ ప్లాన్‌లో భాగంగానే..

ఈ క్రమంలోనే కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపడుతున్న రాహుల్ ద్రవిడ్ ముందుగా జట్టు కాంబినేషన్‌పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా కార్యచరణను ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్‌లో ఓ పేస్ ఆల్‌రౌండర్ ఉండటం కీలకమని భావించిన ద్రవిడ్.. యువ ఆటగాడైన వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ మునపటిలా సత్తా చాటకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడిని సిద్దం చేసుకోవడం ఉత్తమమని ద్రవిడ్ భావించినట్లు తెలుస్తోంది.

 అయ్యర్ రాణించెనా?

అయ్యర్ రాణించెనా?

అయితే గతంలో హార్దిక్ పాండ్యా ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన శివం దూబే, విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యారు. మరీ వెంకటేశ్ అయ్యర్ తన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడా? లేదా? అనేది సందేహమే. పైగా అతను ఓపెనర్.. మిడిలార్డర్‌లో అడ్జస్ట్ అవ్వడం సవాల్‌తో కూడుకున్నది. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో 5, 6 వ స్థానాల్లో వచ్చి బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఓపెనర్‌గా ఎవరైనా ఆడగలరు కానీ ఫినిషర్ రోల్‌లో ఆడాలంటే ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి. ఎందుకంటే ఓపెనర్లు ఆచితూచి ఆడే సమయం ఉంటుంది. కానీ ఫినిషర్స్ ఫస్ట్ బాల్‌నే సిక్స్‌గా మలిచే సామర్థ్యం ఉండాలి. అలా వెంకటేశ్ అయ్యర్ ఆడగలడా? అనేది అనుమానమే. హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వాలంటే మునపటిలా సత్తాచాటాలి. దేశవాళీలో మెరిస్తే అతనికి మళ్లీ అవకాశం దక్కవచ్చు. లేకపోతే హార్దిక్ కెరీర్ ముగిసినట్లే.

Story first published: Wednesday, November 10, 2021, 16:05 [IST]
Other articles published on Nov 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+