For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కష్టాలకు కృంగిపోను.. విజయాలకు పొంగిపోను: హార్దిక్ పాండ్యా భావోద్వేగం!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ.. ఇటు కెరీర్‌లోనూ హార్దిక్ పాండ్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యాకు కష్టాలు మొదలయ్యాయి.

ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ రోహిత్ శర్మ అభిమానులు.. హార్దిక్ పాండ్యాపై తమ కోపాన్ని ప్రదర్శించారు. ప్రతీ మ్యాచ్ సందర్భంగా ఏగతాళి చేస్తూ తీవ్రంగా వేధించారు. సహచర ఆటగాళ్లు కూడా హార్దిక్‌కు సహకరించకపోవడంతో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

Hardik Pandya breaks silence on his personal and professional bad phase ahead of T20 World Cup 2024

సతీమణితో విడాకులు..
ఆ కొద్ది రోజులకే తన జీవిత భాగస్వామి నటాషా స్టాన్‌కోవిచ్‌తో హార్దిక్ పాండ్యాకు విభేదాలు వచ్చాయని, ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా.. పాండ్యా అనే ఇంటి పేరును తొలగించడం, ఆమె బర్త్‌డేకు హార్దిక్ విషెస్ చెప్పకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ఈ జోడీ ఇప్పటి వరకు తమ విడాకులపై అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వార్తలను ఖండించలేదు.

Hardik Pandya breaks silence on his personal and professional bad phase ahead of T20 World Cup 2024

కష్టాలకు భయపడడు..
టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన కష్టాలపై పెదవి విప్పాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కృంగిపోనని, విజయాలకు పొంగిపోనని తెలిపాడు. 16 ఏళ్ల వయసులోనే తాను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఇంత కంటే ఎక్కువ కష్టాలను అనుభవించానని స్పష్టం చేశాడు.

16 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఎలా కష్టపడి ఈ స్థాయికి చేరాడో... ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను కూడా ఆ 16 ఏళ్ల హార్దిక్ పాండ్యానే అధిగమిస్తాడని చెప్పాడు. 'హార్దిక్ పాండ్యా కష్టాలకు భయపడడు. సమస్యలను చూసి పారిపోడు. నేను నా కష్టాన్నే నమ్ముకున్నాను. కష్టం ఎప్పుడూ వృధా కాదు.

నాకు కష్టాలు కొత్త కాదు..
కొన్నిసార్లు జీవితం మనల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తోంది. ఈ కష్టాలకు భయపడి నా ఆటను వదిలిపెట్టలేను. నేను ఆటను వదిలేస్తే కోరుకున్నది అందుకోలేను. కష్టాలు ఎదురైనప్పుడు మరింత కష్టపడాలి. జీవితం అన్నప్పుడు మంచి, చెడు రెండూ ఉంటాయి.

నా చిన్నప్పటి నుంచి ఇలాంటి సమస్యలను ఎన్నో ఎదుర్కొన్నాను. నేను ఎప్పుడూ నా విజయాలను తలకు ఎక్కించుకోను. కష్టాలకు భయపడను. ఫలితం ఎలా ఉన్నా నా పని నేను చేసుకుంటూ పోతాను. నా సామర్థ్యాలను పెంచుకునేందుకు మరింత కష్టపడుతాను.

Hardik Pandya breaks silence on his personal and professional bad phase ahead of T20 World Cup 2024

16 ఏళ్ల పాండ్యా గట్టెక్కిస్తాడు..
ప్రస్తుతం నా వయసు 30 ఏళ్లు. నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పటి కంటే ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నాను. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం 16 ఏళ్ల వయసులో నేను పడ్డ కష్టం. నా ప్రస్తుత సమస్యల నుంచి కూడా ఆ 16 ఏళ్ల పాండ్యానే గట్టెక్కిస్తాడు.

ఆ 16 ఏళ్ల పాండ్యానే నా గురువు. అతనే నాకు స్పూర్తి. అప్పుడు నాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ప్రతీది నా కష్టార్జితమే'అని హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు.

Story first published: Wednesday, June 5, 2024, 20:14 [IST]
Other articles published on Jun 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+