ఆ ఒక్క తప్పిదమే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే మెరుగైన ఆరంభం లభించాలని, అది జరగలేదని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 103 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
సీఎస్‌కే నిర్దేశించిన 208 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 104 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. పిచ్ బాలేదనే సాకులు తాను చెప్పనని, ప్రత్యర్థి తమ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసిందని కొనియాడాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడని ప్రశంసించాడు. వచ్చే మ్యాచ్‌ల్లో ఏం మార్పులు చేయాలో ఆలోచించి తమ తప్పులను సరిదిద్దుకుంటామన్నాడు.

'పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లో వెనుకబడిపోయాం. ఆ తర్వాత మేం కోలుకోలేకపోయాము. పిచ్ మారింది, బాలేదు అనే సాకులు నేను చెప్పను. సాకులు చెప్పడం నాకు నచ్చదు. సీఎస్‌కే అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది సేమ్ వికెట్. అదే మట్టి. మేమే ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈ వికెట్‌పై స్పిన్నర్లకు పట్టుదొరికింది. మా స్పిన్నర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. కానీ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అదే సమయంలో ఇతర బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. తద్వారా సీఎస్‌కే మంచి లక్ష్యాన్ని నమోదు చేసింది. పవర్ ప్లేలో మెరుగైన ఆరంభం లభిస్తే ఈ లక్ష్యాన్ని మేం ఛేదించేవాళ్లం. కానీ పవర్ ప్లేలోనే మాకు కావాల్సిన మూమెంటమ్ లభించలేదు. వచ్చే మ్యాచ్‌ల్లో తుది జట్టులో చేయాల్సిన మార్పుల గురించి చర్చిస్తాం. ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మా తదుపరి మ్యాచ్‌కు కొన్ని రోజుల సమయం ఉంది. మేం మా తప్పిదాలపై ఫోకస్ పెడుతాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications