వాడి బ్యాటింగ్‌కు పిచ్చోడినయ్యా.. మా ఓటమికి కారణం అదే: హార్దిక్ పాండ్యా
రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అతను ఆడుతున్న ఫియర్‌లెస్ గేమ్ చూసి పిచ్చోడినయ్యానని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గౌహతి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తమ ఓటమికి చెత్త బౌలింగే కారణమని అంగీకరించాడు. పవర్ ప్లేలో ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయాలేకపోయామని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పిన హార్దిక్.. భవిష్యత్తులో అతను ఇంతకంటే మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించాడు.
బ్యాటింగ్ కాదు.. బౌలింగే..
'మా బౌలింగ్ వైఫల్యమే ఓటమికి కారణం. బ్యాటింగ్ ఏ మాత్రం కాదు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ ఓటమికి మా బౌలర్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ యూనిట్‌గా మేం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ రాజస్థాన్ మాత్రం అద్భుతమైన క్రికెట్ ఆడింది. ఈ ఓటమికి బ్యాటింగ్ ఏ మాత్రం కారణం కాదు. ఈ ఓటమికి ఖచ్చితంగా మా బౌలింగ్ విభాగమే బాధ్యత వహించాలి.

టీ20 క్రికెట్‌లో రెండు బంతులతో ఫలితం మారిపోతుంది. 27 పరుగుల తేడాతో ఓడిపోయామంటే.. ఐదు బంతులు మంచిగా వేయాల్సింది. అలా వేసి ఉంటే ఐదు సిక్సర్లు వచ్చేవి కావు. మేం సరైన బంతులు వేసి ఉంటే కచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేవాళ్లం. కానీ రాజస్థాన్ ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆ తర్వాత మేం ఎంత ప్రయత్నించినా విజయం దక్కలేదు.
వైభవ్ బ్యాటింగ్‌కు షాకయ్యా..
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ నిర్భయంగా ఆడటం చూసి షాకయ్యాను. ఈ మ్యాచ్‌కు సిద్దమయ్యేటప్పుడు అతని గురించి మేం మాట్లాడుకున్నాం. అతను బ్యాటింగ్ చేసినా విధానం.. ఫియర్‌లెస్ గేమ్, షాట్ సెలెక్షన్ అద్భుతం.. అమోఘం. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం. రేపు ఉదయం సూర్యుడు ఉదయించినట్లే మేం కూడా పుంజుకుంటాం. మా తప్పులను సరిదిద్దుకొని ఆర్‌సీబీతో తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
𝙂𝙖𝙢𝙚 𝙧𝙚𝙘𝙤𝙜𝙣𝙞𝙨𝙚𝙨 𝙜𝙖𝙢𝙚! 🤝
— IndianPremierLeague (@IPL) April 7, 2026
🎥 #MI captain Hardik Pandya with some very kind words for the young Vaibhav Sooryavanshi 🩷#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/t5Wg9LCtoV
వైభవ్, యశస్వి ఊచకోత..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 39) దూకుడుగా ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా మొహమ్మద్ గజన్‌ఫర్(2/21) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టాడు.
బుమ్రా, బౌల్ట్, హార్దిక్, దీపక్ చాహర్ తీవ్రంగా నిరాశపర్చారు. బుమ్రా బౌలింగ్‌లో తొలి మూడు బంతుల్లోనే వైభవ్ రెండు సిక్స్‌లు బాదడం విశేషం. అనంతరం ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేసి ఓటమిపాలైంది. షెర్ఫన్ రూథర్‌ఫోర్డ్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25), నమన్ ధీర్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications