న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya కీలక నిర్ణయం.. భారత జట్టుకు ఎంపిక చేయవద్దని సెలెక్టర్లకు రిక్వెస్ట్!

Hardik Pandya asks selectors not to select him for SA tour

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అప్ కమింగ్ సౌతాఫ్రికా పర్యటనకు తనను ఎంపికచేయవద్దని సెలెక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు తనను సెలెక్షన్ ప్రక్రియకు కొద్ది రోజులు దూరంగా ఉంచాలని తెలిపాడు. ఈ మేరకు భారత సెలెక్షన్ కమిటీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పాండ్యా ఈమెయిల్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2019 వెన్ను శస్త్ర చికిత్స అనంతరం ఫామ్ కోల్పోయిన పాండ్యా తడబాటు కొనసాగుతూనే ఉంది. మునపటిలా బౌలింగ్ చేయకపోవడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రాణించడం లేదు.

 చెత్తాటతో...

చెత్తాటతో...

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటలేకపోయాడు. దాంతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అంతకుముందు జరిగిన ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2020 సీజన్లలో కూడా పాండ్యా రాణించలేదు. ఆస్ట్రేలియా పర్యటన, శ్రీలంక పర్యటనతో పాటు సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో కూడా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. అయినా అతని స్టార్ హోదాను పరిగణలోకి తీసుకొని సెలెక్టర్లు ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించి మూల్యం చెల్లించుకున్నారు. ఇక పాండ్యా సెలెక్షన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ల నుంచి పాండ్యాపై వేటు వేసారు.

హార్దిక్‌పై సెటైర్స్..

హార్దిక్‌పై సెటైర్స్..

ప్రస్తుతం ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన హార్దిక్.. సుదీర్ఘ కెరీర్ కొనసాగించేందుకే కొంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ ఇవ్వాలనకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హార్దిక్ సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలు హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగానే వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నప్పుడు మళ్లీ అతనికి అవకాశం ఎందుకు ఇస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వెంకటేశ్ అయ్యర్‌ను హార్దిక్‌లా తీర్చిదిద్దాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసి అవకాశమిచ్చింది. వెంకటేశ్ అయ్యర్ సైతం పర్వాలేదనిపించాడు.

సఫారీ టూర్‌పై నీలినీడలు..

సఫారీ టూర్‌పై నీలినీడలు..

సౌతాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీమిండియా పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత జట్టును అక్కడ పంపించాలా? వద్దా? అనే సందిగ్దంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాత సౌతాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) అధికారులతో చర్చిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దాని తర్వాతే టీమిండియా పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. డిసెంబరు 17 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు టీమిండియా.. సౌతాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు సౌతాఫ్రికాతో.. మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.

Story first published: Sunday, November 28, 2021, 18:26 [IST]
Other articles published on Nov 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X