టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని సతీమణి, బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకొని, సహజీవనం చేసిన ఈ జంట ఓ కుమారుడికి జన్మనిచ్చిన తర్వాతే కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది.
చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట తమ కుమారుడు అగస్త్య పాండ్యకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేది. హార్దిక్ పాండ్యా ఆడే ప్రతీ మ్యాచ్‌కు నటాషా హాజరై తన భర్త టీమ్‌కు అండగా నిలిచేది. అయితే ఏమైందో ఏమో కానీ గత రెండు నెలలుగా ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

హార్దిక్ పేరును తొలిగించిన నటాషా..
దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు ఊతం అందించింది. ఇన్‌స్టాలో కేవలం కుమారుడితో తాను ఉన్న చిత్రాలను మాత్రమే ఆమె ఉంచింది.
యూజర్‌నేమ్‌లో పాండ్య అనే పదాన్ని కూడా తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. అంతేకాకుండా ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా నటాషా కన్పించలేదు. ముంబై ఆడే మ్యాచ్‌లను చూసేందుకు ఆమె స్టేడియానికి రాలేదు. ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యాకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు.
బర్త్‌డే విషెస్ చెప్పని హార్దిక్..
ఇదే సమయంలో మార్చి 4న నటాషా పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ పాండ్యా కూడా విష్ చేయలేదు. ఇవన్నీ హార్దిక్-నటాషా విడాకుల ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. విడాకుల్లో భాగంగా భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70 శాతం మేర ఇవ్వాలని నటాషా డిమాండ్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే తన ఆస్తిలో 50 శాతానికి పైగా తన అమ్మ పేరిట ఉండటం హార్దిక్ పాండ్యాకు కాస్త ఉపశమం కలిగిస్తుంది. భవిష్యత్‌లో ఏమైనా వివాదాలు జరిగితే ఆస్తి కోల్పోకుండా ఉండటానికి ఇలా చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ స్వయంగా చెప్పాడు.
వివాహేతర సంబంధమే..
అయితే హార్దిక్-నటాషా విడిపోవడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. హార్దిక్ తెలియకుండా నటాషా తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ గాసిప్స్ చెప్పే ఉమైర్ సంధూ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. దుబాయ్‌లో ఓ హోటల్లో నటాషా.. మరో వ్యక్తితో హార్దిక్ పాండ్యా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిందని పేర్కొన్నాడు.
సెర్బియా వంటి పేద దేశం నుంచి వచ్చిన నటాషాకు డ్రగ్స్ తీసుకోవడంతో పాటు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అలువాటని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే హార్దిక్‌కు తెలియకుండా నటాషా ఎఫైర్స్ పెట్టుకోవడంతోనే అతను వదిలేసాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.