Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో అమ్మాయితో హార్దిక్ పాండ్యా.. ఎవరీ నయా గర్ల్‌ఫ్రెండ్?(వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో అమ్మాయితో కెమెరాకు చిక్కాడు. తన సతీమణి, బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులిచ్చిన హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. కానీ స్టాంకోవిచ్‌తో విడాకుల అనంతరం అతను రోజుకో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటీష్ సింగర్, మోడల్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది. ఈ ఇద్దరూ బీచ్‌లో ఛిల్ అయిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ నిజమేనని అంతా అనుకున్నారు.

ఏమైందో ఏమో తెలియదు కానీ.. జాస్మిన్‌కు గుడ్‌బై చెప్పిన హార్దిక్ పాండ్యా.. మరో అమ్మాయిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మోడల్ మహికా శర్మతో హార్దిక్ కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. గత నెలలోనే మహికా శర్మతో హర్దిక్ పాండ్యా ఎఫైర్ పెట్టుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా గుసగుసలు వినిపించాయి. ఈ ఇద్దరూ ఇన్‌స్టాలో ఒకరిని ఒకరు ఫాలో చేసుకున్నారని, లైక్ చేసుకున్నారని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.

Hardik Pandya and Mahieka Sharma Spotted Together at Mumbai Airport Amid Dating Rumours Video
Photo Credit: X (twitter)

చెట్టాపట్టాలేసుకొని..

వాటిని నిజం చేసేలా తాజాగా ఈ ఇద్దరూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఏ మాత్రం మోహమాటం లేకుండా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని విమానాశ్రయంలో కనిపించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా.. మహికా శర్మతో డేటింగ్‌లో ఉన్నాడనే పుకార్లు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ రిలేషన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

శుక్రవారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో హార్దిక్ పాండ్యా, మహికా శర్మ కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. 'లక్ అంటే నీది సోదరా.. రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నావ్'అని సెటైర్లు పేల్చుతున్నారు.

ఎవరీ మహికా శర్మ..

ఢిల్లీకి చెందిన మహికా శర్మ, ఆర్ధిక శాస్త్రం, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత కొన్ని కంపెనీల్లో పనిచేసిన ఆమె.. ఆ తర్వాత మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ర్యాపర్ రాజాతో కలిసి ఓ వీడియో సాంగ్‌లో కనిపించిన మహికా శర్మ.. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. 'PM నరేంద్ర మోదీ' సినిమాలో కూడా నటించిన మహికా శర్మ, ప్రముఖ యాడ్స్‌లో కూడా కనిపించింది.

అందాల పోటీల్లో పాల్గొని మిస్ టీన్ నార్త్‌ఈస్ట్ టైటిల్‌ను గెలుచుకుంది. అస్సామీ సినిమాలతో పాటు హిందీ టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించింది. ముఖ్యంగా F.I.R (టీవీ సిరీస్) మిస్టర్ జో బి. కార్వాల్హో, మర్దానీ వంటి బాలీవుడ్ చిత్రాల్లో కూడా కనిపించింది. నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యాకు అగస్త్యా అనే కొడుకు జన్మించాడు.

Story first published: Friday, October 10, 2025, 13:55 [IST]
Other articles published on Oct 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+