Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. గురుదక్షిణగా రూ. 80 లక్షల సాయం!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా గొప్ప మనసు చాటుకున్నారు. తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్‌కు గురుదక్షిణగా రూ. 80 లక్షల వరకు ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని జితేంద్ర సింగ్ టీచర్స్ డే(సెప్టెంబర్ 5) సందర్భంగా మీడియాకు తెలియజేశారు. తన శిష్యుల గొప్ప మనసుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

'హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా 2018లో నా మొదటి సోదరి పెళ్లి సజావుగా జరిగేలా చూసుకున్నారు. పెళ్లికి ఆర్థిక సాయం చేశారు. గతేడాది ఫిబవ్రరి(2024)లో నా రెండో సోదరి పెళ్లి జరగ్గా.. కారు కొనుగోలు చేసేందుకు రూ. 20 లక్షలు సాయం చేశారు. 'నీ చెల్లి నాకు చెల్లినే. పెళ్లి ఖరారు కాగానే నాకు చెప్పు.'అని హార్దిక్ నాతో అన్నాడు. పెళ్లి గురించి చెప్పగానే కావాల్సిన ఏర్పాట్లను చేశాడు.'అని జితేంద్ర సింగ్ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

మా అమ్మ కోసం డబ్బులన్నీ ఇచ్చేసాడు..

2015లో ముంబై ఇండియన్స్ జట్టుతో హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి వరకు పాండ్యా బ్రదర్స్‌కు జితేంద్ర సింగ్ అండగా నిలిచాడు. అయితే హార్దిక్ ఐపీఎల్‌ ఆడుతున్న సమయంలో తన తల్లి తీవ్ర అస్వస్థతకు గురైందని జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని హార్దిక్‌కు చెప్పలేదన్నారు.

'హార్దిక్‌ ఏకాగ్రతను దెబ్బతీయడం ఇష్టం లేక నా తల్లి అనారోగ్యం గురించి అతనికి చెప్పలేదు. బరోడాకు తిరిగొచ్చిన తర్వాత నాకు ఏదో సమస్య ఉందని గ్రహించి ప్రశ్నించారు. అప్పుడు నా తల్లి అనారోగ్యానికి గురైందని చెప్పాను. అతను వెంటనే 'నా డబ్బంతా తీసుకొని ఆమె కోలుకునేలా చేయండి'అని అన్నాడు. ఇది అతని గొప్ప మనసుకు ఉదాహరణ. ఆస్ట్రేలియా 2015-26 పర్యటన తర్వాత హార్దిక్ పాండ్యా నాకు రూ.5-6 లక్షల ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు.

Hardik and Krunal Pandya Provide 80 Lakh Financial Aid to Childhood Coach Jitendra Singh
Photo Credit: X (twitter)

కృనాల్ ఒప్పించాడు..

భారత్ తరఫున అది అతనికి మొదటి పర్యటన. ఆర్థికంగా కూడా అంత బలంగా లేడు. అతని బహుమతికి నేను ఆశ్చర్యపోయాను. ముందుగా తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కృనాల్ పాండ్యా నన్ను ఒప్పించాడు. ఆ వెంటనే మీ భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఈ కారును బహుమతిగా ఇస్తున్నామని హార్దిక్ చెప్పాడు. బైక్ నడుపుతూ ప్రమాదానికి గురికావద్దని కారు కొనిస్తున్నామని తెలిపాడు. ఈ మాటలకు నేను భావోద్వేగానికి గురయ్యాను.

రూ. 18 లక్షలు పంపించాడు..

2017, 2019 ఐపీఎల్‌లో ముంబై విజేతగా నిలిచిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఆర్థిక సాయం చేశారు. ఐపీఎల్ 2025 విజయం తర్వాత కృనాల్ పాండ్యా కొత్త కారు కొనుక్కోమని రూ. 18 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇప్పటి వరకు పాండ్యా బ్రదర్స్ రూ. 70-80 లక్షలు ఆర్థిక సాయం చేశారు. నా నేపథ్యం దిగువ మధ్యతరగతి కుటుంబం కాబట్టి వారి సాయం నాకు విలువైనది.

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వివాహాల సమయంలో నా జేబులో నుంచి రూపాయి ఖర్చు కాకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. 2016లో హార్దిక్ పాండ్యా రూ. 2 లక్షల నైకీ ఉత్పత్పులను బహుమతిగా ఇచ్చాడు. నేను కొనుగోలు చేయలేని దుస్తులను కృనాల్ కొనిచ్చాడు. హార్దిక్,కృనాల్ పాండ్యా వంటి శిష్యులు నాకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.'అని జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు.

Story first published: Friday, September 5, 2025, 16:09 [IST]
Other articles published on Sep 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+