కోహ్లీ.. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు! ఇన్నాళ్లు కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి నడిచింది! భజ్జీ వార్నింగ్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించాడు. ఇక నుంచి ఒళ్లు దగ్గరపెట్టుకొని బ్యాటింగ్ చేయాలని, లేకుంటే జట్టులో చోటే గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నాడు. ఇన్నాళ్లు కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి నడిచిందని, ఇక నుంచి కుదరదని తెలిపాడు. ఎంత పెద్ద ఆటగాడైనా మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో ఉంటాడని లేకుంటే పక్కనపెట్టేస్తేరాని వార్నింగ్ ఇచ్చాడు. ఇక గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తలేడనే విషయం తెలిసిందే. ఆడపా దడపా పరుగులు చేస్తున్న అవి అతని స్థాయికి సరిపోవడం లేదు. ఇటీవల టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న విరాట్.. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాడు.

యువ ఆటగాళ్లు రెడీ..
ఈ క్రమంలోనే ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన హర్భజన్ సింగ్.. ప్రస్తుతం జట్టులో విపరీతమైన పోటీ నెలకొందని, ఇది దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ చేయాలని కోహ్లీకి సూచించాడు. 'అప్‌కమింగ్ ఐపీఎల్‌లో రాణించే దేశీయ ఆటగాళ్లు సైతం టీమిండియాలో స్థానం కోసం పోటీపడతారు. వీరి నుంచి కూడా కోహ్లీ స్థానానికి ముప్పు పొంచి ఉంది. ఎంతటి ఘన చరిత్ర కలిగిన ఆటగాడికైనా మంచి ప్రదర్శనలే జట్టులో స్థానం కల్పిస్తాయనేది కాదనలేని సత్యం. విరాట్ కోహ్లీ కూడా అందుకు అతీతుడేమీ కాదనేది నా అభిప్రాయం. గతంలో దిగ్గజ క్రికెటర్లు సైతం పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయారు.

ఇప్పుడు కుదురదు..
ఐదు నెలల క్రితం వరకు కోహ్లీ అన్ని ఫార్మాట్లలో జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు, జట్టు ఎంపికలో కెప్టెన్‌కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఫామ్‌తో సంబంధం లేకుండా తుది జట్టులో కొనసాగాడు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదనే విషయాన్ని కోహ్లి గ్రహించాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోహ్లీపై ఒత్తిడి ఉండటం సహజమే. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లి.. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక్క సెంచరీ కూడా బాధలేకపోయాడు.

కెప్టెన్సీని వదులుకున్న కోహ్లీ
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లీకి.. సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని అతని వన్డే కెప్టెన్సీపై వేటు వేసి రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్సీని వదులుకుంటున్నాని కోహ్లీనే స్వయంగా ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications