Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మమ్మల్ని వాడుకొని వదిలేసారు.. బీసీసీఐపై హర్భజన్ సింగ్ ఫైర్!

Harbhajan Singh slams BCCI officials for not letting the 2011 WC winning squad play another game
Harbhajan Singh - 2011 World Cup Players Treated Like ‘Use and Throw’ | Oneindia Telugu

న్యూఢిల్లీ: 2011 ప్రపంచకప్ విజేతలమైన తమను వాడుకొని వదిలేసారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డు పక్షపాత వైఖరి కారణంగా 2011 ప్రపంచకప్ టీమ్‌లోని సీనియర్ ఆటగాళ్ల కెరీర్ నాశనమైందని మండిపడ్డాడు. ఆ విన్నింగ్ టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లకు అదే చివరి ప్రపంచకప్ అయిందని తెలిపాడు.

తాజాగా బ్యాక్ స్టేజ్ విత్ బోరియా కార్యక్రమంలో మాట్లాడిన హర్భజన్ సింగ్.. అప్పటి బీసీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమను బోర్డు వాడుకుని వదిలేసిందన్న హర్భజన్.. 2011 జట్టు అంటే అంత అలుసా? అంటూ ఫైర్ అయ్యాడు.

ప్రపంచకప్ గెలిచిన జట్టే..?

ప్రపంచకప్ గెలిచిన జట్టే..?

'ఆ సమయంలో బీసీసీఐ అధికారులు ఏం చేసేవారో మీకు తెలుసు. అప్పుడు టీమిండియాలో ఆడేందుకు కేవలం కొందరికే అవకాశం వచ్చేది. మిగతా వారిని అసలు పట్టించుకోలేదు. 2011లో ప్రపంచకప్​ను సాధించిన సత్తా ఉన్న మా జట్టుకు ఆ తర్వాత ఒక్క మ్యాచ్​ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. ప్రపంచకప్​ సాధించేందుకు సరైనది అని మీరు భావించిన జట్టే టోర్నీ తర్వాత పనికి రాకుండా పోయిందా?'అని హర్భజన్​ సింగ్ ప్రశ్నించాడు.

 2015 ప్రపంచకప్ నాటికే..

2015 ప్రపంచకప్ నాటికే..

'2011 ప్రపంచకప్​ నాటికి నాకు 31 ఏళ్లు.. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన యువరాజ్​ సింగ్ (30), సెహ్వాగ్ (32), ఫైనల్లో టాప్ స్కోరర్ అయిన గౌతమ్ గంభీర్​ కూడా 29 ఏళ్ల వయసులోనే ఉన్నారు. కానీ 2015 ప్రపంచకప్​ నాటికి మేం అసమర్థులం అయ్యామా? ఒకరి తర్వాత మరొకరిని జట్టు నుంచి ఎందుకు తప్పించారు?.. తమను యూజ్​ అండ్​ త్రోగా ఎందుకు భావించారు?'అని హర్భజన్ సింగ్ నిలదీశాడు.

ఇది భారత​ క్రికెట్​లో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించాడు.' 2011 వరకు నాకు కొందరు అండగా నిలిస్తే మరికొందరు నన్ను అణచివేసేందుకు ప్రయత్నించేవారు. కానీ 2012 తర్వాత వాళ్లు నన్ను పూర్తిగా జట్టులోంచి తప్పించారు' అని హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

గాడ్ ఫాదర్ లేకనే..

గాడ్ ఫాదర్ లేకనే..

బీసీసీఐలో గాడ్ ఫాదర్ లేకనే భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకోలేకపోయానని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. భారత జట్టును నడిపించాలంటే బోర్డు పెద్దల నుంచి మద్దతు ఉండాలని చెప్పాడు. లేకుంటే ఆ గౌరవం దక్కదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే భారత జట్టుకు కెప్టెన్ అయ్యే సామర్థ్యం తనకు ఉందని భజ్జీ తెలిపాడు. ఇక కెప్టెన్ కాలేదనే పశ్చాతాపం అయితే తనకు లేదని, ఓ ప్లేయర్‌గా దేశానికి సేవ చేయడం తనకు ఎప్పుడూ సంతోషమేనని చెప్పాడు.

ధోనీ ఏం నా పెళ్లాం కాదు..

ధోనీ ఏం నా పెళ్లాం కాదు..

మాజీ కెప్టెన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ‌తో సాన్నిహిత్యం ఎలా ఉండేదని ప్రశ్నించగా.. బాగుండేదని చెప్పిన భజ్జీ.. అతనేం తన పెళ్లం కాదని సెటైర్లు పేల్చాడు. ధోనీతో మీకు పడేది కాదనే ప్రచారం ఉందని ప్రశ్నించగా.. భజ్జీ తనదైన శైలిలో బదులిచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చుకున్నారని తెలిపాడు. 2011 ప్రపంచకప్ తర్వాత ఆ జట్టు మళ్లీ ఎందుకు ఆడలేదని భజ్జీ ప్రశ్నించాడు. సెహ్వాగ్, గంభీర్‌తో పాటు తాను ఐపీఎల్ ఆడుతుండగానే జట్టుకు దూరం కావాల్సి వచ్చిందన్నాడు.

Story first published: Thursday, February 3, 2022, 19:23 [IST]
Other articles published on Feb 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+