Andrew Symonds మృతిపై హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే?

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సైమండ్స్ మరణ వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని ట్వీట్ చేశాడు. అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, సైమండ్స్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే మైదానంలో ఆండ్రూ సైమండ్స్‌తో జరిగిన వివాదాలన్నీ మరచి హర్భజన్ సింగ్ అతని మరణంపై స్పందించడాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు.
ఉప్పు-నిప్పుగా..
ఇక భజ్జీ- సైమండ్స్ ఆడే రోజుల్లో ఈ ఇద్దరూ ఉప్పు-నిప్పుగా ఉండేవారు. ఈ ఇద్దరి మధ్య పోరును అభిమానులు కూడా ఆస్వాదించేవారు. 2008లో ఈ ఇద్దరి కారణంగా చోటు చేసుకున్న మంకీ గేట్ వివాదం క్రికెట్ చరిత్రలోనే ఓ మచ్చగా నిలిచిపోయింది. ఈ వివాదాన్ని అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. 2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది.

మంకీ గేట్ వివాదం..
దీంతో రిఫరీ హర్భజన్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని స్పష్టం చేసిన అప్పటి భారత్ ఆటగాళ్లు.. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో, అతను ఈ శిక్షను రద్దు చేశారు.

కెరీర్ నాశనమైంది..
తన కెరీర్‌ను 'మంకీ గేట్' వివాదమే నాశనం చేసిందని ఓ సందర్భంలో సైమండ్స్ తెలిపాడు. అప్పట్లో భజ్జీ తనను మంకీ అంటూ గెలీ చేశాడని చెప్పాడు. మంకీ గేట్ వివాదం జాతి వివక్ష వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చాడు. అయితే తమ జట్టు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దదిగా చేసిందని అన్నాడు. ఆ వివాదం తర్వాతే తాను ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టానని చెప్పిన సైమండ్స్... మంకీ గేట్ వివాదం నుంచి తాను కోలుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం సైమండ్స్, భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవంగా మిగిలిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications