
తొలి మ్యాచ్‌లో ఓడి..
సొంతగడ్డపై జరిగిన నాటి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వాంఖడే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత్ ఓడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా విఫలమవడంతో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయాన్నందుకొని సిరీస్‌లో శుభారంభం చేసింది. హర్భజన్ కూడా 4 వికెట్లు మాత్రమే తీసాడు. ఇక కోల్‌కతా వేదికగా జరిగిన రెండో మ్యాచ్ భారత్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
వీవీఎస్ లక్ష్మణ్(281), రాహుల్ ద్రవిడ్(180) నెలకొల్పిన వరల్డ్ రికార్డు భాగస్వామ్యం ఈ మ్యాచ్‌లోనేదే. తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైన.. భారత్ ఫాలోఆన్ ఆడి మరీ ఘనవిజయాన్నందుకుంది. లక్ష్మణ్, ద్రవిడ్ సూపర్ బ్యాటింగ్ ఫుణ్యమా రెండో ఇన్నింగ్స్ 657/7వద్ద డిక్లెర్ చేసింది. దీంతో 171 పరుగుల భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భజ్జీ 13(7+6)వికెట్లతో చెలరేగాడు.

ఉత్కంఠకే ఊపిరందని మ్యాచ్..
ఇక రెండో మ్యాచ్ భారత్ గెలవడంతో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ సిరీస్ డిసైడర్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆద్యాంతం ఉత్కంఠతను రేపింది. ఇరు జట్లు నువ్వా-నేనా అన్న తరహాలో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేయగా.. టాపార్డర్, మిడిలార్డర్ చెలరేగడంతో భారత్ 501 పరుగులకు ముగించింది.
అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 264 పరుగులుకు కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 155 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ అనూహ్యం జరిగింది. ఆసీస్ బౌలర్లు చెలరేగడం భారత బ్యాట్స్‌మన్‌కు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఒక్క వీవీఎస్ లక్ష్మణ్(66) మినహా అంతా విఫలమయ్యారు. దీంతో భారత్ 135 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ విజయానికి 20 పరుగులు.. ఆసీస్ గెలుపు మూడు వికెట్లు కావాలి. వీవీఎస్ కూడా 6 వికెట్‌గానే వెనుదిరిగాడు. టెయిలేండర్లు మాత్రమే ఉండటంతో మైదానమంతా నిశబ్దం వహించింది. నరాలు తెగేంత ఉత్కంఠత నెలకొంది. సమీర్ దిగే(22 నాటౌట్).. జహీర్‌తో కలిసి పోరాడాడు. కానీ జహీర్ పరుగులేమి చేయకుండా 151 పరుగుల వద్ద 8వ వికెట్‌గా వెనుదిరిగాడు.
దీంతో భారత్ విజయానికి నాలుగు పరుగుల అవసరమయ్యాయి. కానీ మెక్‌గ్రాత్ వంటి బౌలర్లతో ఎక్కడో భయం. కానీ క్రీజులోకి వచ్చిన భజ్జీ మూడు పరుగులు తీసి భారత్‌కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఆద్యాంతం డ్రామాను తలపించిన ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట ఇప్పటికి హల్ చల్ చేస్తాయి.

హర్భజన్ 15 వికెట్లు..
ఈ మ్యాచ్‌లోనే భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏకంగా 15 వికెట్లతో చెలరేగాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు.. ఆ సీరిస్ ఆసాంతం తన స్పిన్‌తో కంగారులను కంగారెత్తించాడు. భజ్జీ స్పిన్‌ను తట్టుకులేక నాటి ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తన కెరీర్‌లో ఓ మధురమైన సీరీస్‌గా.. మరవలేని మ్యాచ్‌గా నిలిచిపోయిన నాటి క్షణాలు హర్భజన్ తాజాగా పంచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా నాటి వీడియోను షేర్ చేశాడు. ‘15వికెట్ల స్పెల్.. అత్యంత ప్రధానమైన త్రో బ్యాక్ 'అని క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు.

ఆ మ్యాచ్ మరవలేనిది..
ఇక ఈ సిరీస్ తన జీవితంలో మరిచిపోలేనిదని భజ్జీ ఇటీవల వెల్లడించాడు.‘2001లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను ఎప్పటికీ మరవలేను. ఈ సిరీస్ ఆసాంతం చావో రేవో లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. వ్యక్తిగతంగా కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా నా కెరీర్ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు దక్కిన గొప్ప అవకాశం. ఆ సమయంలో జట్టు నుంచి చోటు కూడా కోల్పాయాను. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కూడా రంజీ టీమ్ నుంచి తొలగించింది. మా నాన్న కూడా చనిపోయారు. కానీ అనిల్ కుంబ్లే గాయంతో జాన్ రైట్, గంగూలీ స్పిన్నర్ కోసం అన్వేషిస్తుండా అదృష్టవశాత్తు నాకు అవకాశం దక్కింది'అని రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో భజ్జీ 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications
