డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై వేటు వేయండి.. హర్భజన్ సింగ్ ఫైర్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొంది పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస ఓటముల నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విమర్శలు గుప్పించాడు.
వార్నర్ చెత్త కెప్టెన్సీ కారణంగానే ఢిల్లీ ఓటమిపాలవుతుందని, అతని స్థానంలో అక్షర్ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన హర్భజన్ సింగ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'డేవిడ్ వార్నర్ జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. బ్యాటర్ గా రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం సక్సెస్ కావడం లేదు. అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణిస్తున్నాడు. అక్షర్ పటేల్‌లో కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్ వార్నర్ సారథి కాగా అక్షర్ పటేల్ అతనికి డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికైతే ఢిల్లీ క్యాపిటల్స్‌లో కెప్టెన్సీ మార్పు ఉండే అవకాశం లేదు. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయంతో దూరమవడంతో ఢిల్లీ వార్నర్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. అయితే 8 మ్యాచ్‌ల్లో వార్నర్.. రెండింటిలోనే గెలిపించాడు. మరో మ్యాచ్ గనక ఓడితే ఇక ఈ సీజన్ నుంచి ఢిల్లీ అధికారికంగా నిష్క్రమించినట్టే అవుతుంది.
బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వరుసగా ఐదు పరాజయాల అనంతరం రెండు మ్యాచ్‌లు గెలిచి టచ్ లోకి వచ్చినట్టే కనిపించిన ఢిల్లీ.. మళ్లీ శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications