స్మిత్‌కే చెమటలు పట్టిస్తున్నాడు.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతనిదే: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ టీ నటరాజన్‌పై వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్ గడ్డపై అదరగొడుతున్నాడని, స్టీవ్ స్మిత్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాడిని వణికిస్తున్నాడని కొనియాడాడు. ఎంతటీ ఆటగాడికైనా నిర్భయంగా బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకతని తెలిపాడు. ఇక నట్టూ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం చూస్తే చాలా సంతోషం వేస్తుందన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంపై భజ్జీ స్పందించాడు. ఇండియా టూడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'నటరాజన్‌ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు అధిగమించిన తీరు, ప్రస్తుతం ఆసీస్ టూర్‌లో అదరగొడుతున్న విధానం అద్భుతం. కష్టపడి పనిచేస్తూ, మనల్ని మనం నమ్ముకుంటే జీవితంలో అనుకున్నవి సాధించగలమని అతను నిరూపించాడు. ఈ సిరీస్‌లో నట్టూనే బ్రిలియంట్ బౌలర్. భారత జట్టుకు ముఖ్యమైన పిల్లర్. అవసరమైన సమయంలో వికెట్లు తీసి సత్తా చాటుతున్నాడు. టీమిండియా మ్యాచ్‌లో గెలవడంలో తన పాత్ర అద్భుతం. యార్కర్లు సంధిస్తున్న తీరు, డెత్ ఓవర్లలో బౌలింగ్ విధానం ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ 2020లో మెరుగ్గా రాణించిన అతను టీ20 సిరీస్‌లో స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఎదురుగా ఎవరున్నా ఏమాత్రం భయపడటం లేదు. తనలో ఉన్న ప్రత్యేకత అదే'అని హర్భజన్ ఆకాశానికెత్తాడు.
ఆసీస్ పర్యటనలో అద్భుతంగా ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా జోస్యం చెప్పాడు.'ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే జరిగితే తనతో పాటు జట్టులో కూడా సరికొత్త ఉత్సాహం నిండుతుంది. టీమిండియాకు నట్టూ ప్లస్. తనది గొప్ప కథ'' అని భజ్జీ కొనియాడాడు. ఇక నట్టూ బౌలింగ్‌కు మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు విశ్లేషకులు, అభిమానులు ఫిదా అవుతున్నారు. అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఆసీస్‌తో చివరి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నటరాజన్ ఆ మ్యాచ్‌లో రెండు, తొలి 20లో 3, రెండో టీ20లో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications