Harbhajan Singh: ఆరోజు సౌరవ్ గంగూలీ లేకుంటే.. నేనిలా ఉండేవాడిని కాదు

న్యూఢిల్లీ: తాను ఇంత గొప్ప ఆటగాడిగా ఎదగడానికి టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీనే కారణమని దిగ్గజ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అన్నాడు. శుక్రవారం హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనని వెన్నుతట్టి ప్రోత్సహించిన నాయకుడి గురించి మాట్లాడాడు. కెరీర్ ఆరంభంలో సౌరవ్ గంగూలీ సెలెక్టర్లతో తన కోసం పట్టుపట్టకపోయుంటే.. తాను ఇంత పెద్ద ఆటగాడిని అయ్యేవాడిని కాదన్నాడు. అసలు తనకు కనీస గుర్తింపు కూడా ఉండేది కాదన్నాడు. దాదా అండగా నిలిస్తే.. ధోనీ సారథ్యంలో తన కెరీర్ మరో స్థాయికి చేరిందని భజ్జీ చెప్పుకొచ్చాడు.

గంగూలీ లేకుంటే..
'కెరీర్ ఆరంభంలో అనామకుడిగా ఉన్న నాకు గంగూలీనే అండగా నిలిచాడు. తర్వాత ధోనీ సారథ్యంలో ప్రత్యేక ఆటగాడిగా మారాను. నాకెంతో నైపుణ్యం ఉందని దాదాకు తెలుసు. అయితే, నేను అంతలా రాణిస్తానా? లేదా? అనేది తెలియదు. ఇక ధోనీ విషయానికొస్తే.. నేను బరిలోకి దిగితే పని పూర్తి చేస్తానని తెలుసు. అతను జట్టులోకి రాకముందే పలు మ్యాచ్‌లు గెలిపించాను. అలాగే తన సారథ్యంలోనూ మరిన్ని మ్యాచ్‌లు గెలిపిస్తానని ధోనీకి తెలుసు. ఎవరికైనా జీవితంలో లేదా ప్రొఫెషనల్‌గా మనల్ని సరైన దిశలో నడింపించే వ్యక్తి ఒకరు ఉండాలి.

ధోనీ సైతం..
నా విషయంలో అది గంగూలీనే. నేను జట్టులో ఉండేందుకు దాదా ఆరోజు నాకోసం పట్టుపట్టకపోతే (సెలెక్టర్లతో) ఈరోజు నేను ఎవరికి తెలిసేవాడిని కాదు. కనీసం మీరు ఈరోజు నా ఇంటర్వ్యూ కూడా తీసుకునేవాళ్లు కాదు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు దాదానే కారణం. ఇక ధోనీ కూడా చాలా మంచి నాయకుడే. దాదా వారసుడిగా జట్టును నడిపించాడు. అతడి సారథ్యంలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాను. అవి నా జీవితంలో ప్రత్యేకంగా నిలుస్తాయి.

బీసీసీఐకి రుణపడి ఉంటా..
చివరగా ఈ రిటైర్మెంట్ ప్రకటనకు సంబంధించి గంగూలీ, కార్యదర్శి జైషాతో మాట్లాడాను. వారికి నా నిర్ణయం చెప్పాను. వాళ్లు సానుకూలంగా స్పందించి భవిష్యత్ గురించి శుభాకాంక్షలు చెప్పారు. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటా' అని స్పిన్ దిగ్గజం భజ్జీ తెలిపాడు. ఇక, హర్భజన్ 1998లో తొలిసారి మహ్మద్ అజాహరుద్దీన్ సారథ్యంలో టీమ్‌ఇండియాలో అడుగుపెట్టాడు. ఆపై 2001లో గంగూలీ సారథ్యంలో స్వదేశంలో జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌తో తనదైన ముద్ర వేశాడు. ఆపై మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో రెండు ప్రపంచకప్‌లు సాధించాడు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగి భారత జట్టులో అతిగొప్ప ఆఫ్ స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు.

కాంగ్రెస్‌లోకి హర్భజన్..
ఇక అన్ని రకాల ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్.. పొలిటీషియన్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయి. అతను కాంగ్రెస్ పార్టీలో చేరి పంజాబ్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అతను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రాజకీయాలపై హర్భజన్ ఆసక్తికనబరుస్తున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయించాలని పంజాబ్ కాంగ్రెస్ భావిస్తొందంట. భజ్జీ స్వస్థలం జలంధర్.. ఇది దోబా నియోజవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువ. ఇక్కడ శిరోమణి అకళిదల్‌ను ఎదుర్కొనేందుకు పంజాబ్ కాంగ్రెస్ భజ్జీని నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్సుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications