Harbhajan Singh: మంకీగేట్ వివాదం.. నా ఆటో బయోగ్రఫీ ద్వారా వివరిస్తా!

న్యూఢిల్లీ: అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తన కెరీర్‌లోనే మాయని మచ్చలా మిగిలిపోయిన మంకీ గేట్ వివాదంపై స్పందించాడు. అతి త్వరలోనే ఆ వివాదం గురించి తన ఆటో బయోగ్రఫీ ద్వారా వాస్తవాలు తెలియజేస్తానని చెప్పాడు. భారత జట్టు 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో చోటుచేసుకున్న ఈ 'మంకీగేట్ వివాదం' అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఈ వివాదంలో భజ్జీ జాతి విద్వేష వ్యాఖ్యలు చేయలేదని తేలినా.. చివరికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతకు గురయ్యాడు. అయితే ఈ వివాదంతో తన వాదనను ఎవరూ వినలేదన్నాడు.

మనసిక ఆందోళన..
'ఆ వివాదం మొత్తంలో ఎవరూ నా వైపు ఉన్న నిజం గురించి ఆలోచించలేదు. అప్పట్లో కొన్ని వారాల పాటు నేనెలాంటి మానసిక ఆందోళనకు గురయ్యానో ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయంపై నేనెప్పుడూ ఎవరికీ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ, త్వరలోనే ప్రజలందరికీ నా ఆటోబయోగ్రఫీ ద్వారా ఏం జరిగిందనే విషయం తెలుస్తుంది. ఆ సమయంలో నేను ఎలాంటి పరిస్థితులకు గురయ్యానో ఎవరూ అనుభవించకూడదు' అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగింది..?
సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేసింది. ఆండ్రీ సైమండ్స్ (162*) భారీ శతకం సాధించాడు. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ (109), సచిన్ (154*) శతకాలతో చెలరేగడంతో భారత్ 532 పరుగులు చేసింది. మధ్యలో హర్భజన్ (63) పరుగులు చేశాడు. అయితే, ఇన్నింగ్స్ 116వ ఓవర్ తర్వాత భజ్జీ నాన్‌స్ట్రైకింగ్ వైపు వెళ్లి సైమండ్స్‌తో ఏదో మాట్లాడాడు. వెంటనే ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలాయి. ఇక మ్యాచ్ అనంతరం హర్భజన్.. సైమండ్స్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడని, కోతి అని పిలిచాడని ఆ జట్టు కెప్టెన్ రికీపాంటింగ్.. అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.

సచిన్ అండగా నిలబడటంతో..
ఇది మ్యాచ్ రిఫరీ వరకు వెళ్లగా టీమిండియా స్పిన్నర్‌పై 3 టెస్టుల నిషేధం పడింది. అయితే ఈ నిషేదాన్ని ఎత్తేయాలని భారత క్రికెట్ డిమాండ్ చేయడంతో పాటు సిరీస్ బాయ్ కట్ చేస్తామని హెచ్చరించడంతో ఈ ఉదంతంపై పూర్తి విచారణకు ఆదేశించిన ఐసీసీ చివరికి హర్భజన్ అలాంటి వ్యాఖ్యలు చేశాడనడానికి ఆధారాలు లేవని పేర్కొంది.
దాంతో అతను నిషేధాన్ని తప్పించుకున్నాడు. కానీ, మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతకు గురయ్యాడు. ఆ గొడవ సమయంలో క్రీజులో ఉన్న సచిన్ టెండూల్కర్ భజ్జీకి అండగా నిలిచాడు.
పదేపదే స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టిన సైమండ్స్‌కు బజ్జీ బదులిచ్చే ప్రయత్నం చేశాడే తప్పా.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేయలేదని సచిన్ గట్టిగా వాదించాడు. అయితే, ఇప్పుటికీ ఆరోజు హర్భజన్.. సైమండ్స్‌తో ఏమన్నాడో ఎవరికీ తెలియదు. ఈ వివాదంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని తర్వలోనే తెలియజేస్తానని భజ్జీ తాజాగా ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications