Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ ముందు నుంచి కెప్టెన్‌గా ఉన్నా.. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరేది కాదు: హర్భజన్ సింగ్

 Harbhajan Singh says MS Dhonis captaincy wouldnt have made huge difference

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం నుంచే చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును మహేంద్ర సింగ్ ధోనీ నడిపించినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరేది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. చెన్నై తమ కెప్టెన్‌ను మార్చినంత మాత్రానా ఆ జట్టుకు ఒరిగిందేం లేదన్నాడు. ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చెన్నై వైఫల్యం కొనసాగిందని గుర్తు చేశాడు. ఇక టీమ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రవీంద్ర జడేజాను చెన్నై సారథి ఎంపిక చేయగా అతను దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా చెత్త ప్రదర్శన కనబర్చాడు. దాంతో 8 మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతలను మళ్లీ మహీకే అప్పగించాడు.

ఇక చెన్నై కెప్టెన్సీ మార్పుపై తాజాగా స్పోర్ట్స్ కీదాతో మాట్లాడిన హర్భజన్ సింగిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మాహీ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ సాధించిందేమీ లేదు. ధోనీ కెప్టెన్సీలోనూ చెన్నై ఓటమిపాలైంది. మహీ సారథ్య బాధ్యతలు అందుకునే సమయానికి చెన్నైకి ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలున్నాయి. అయినా అర్హత సాధించలేకపోయారు. కారణం వాళ్లకు సరైన టీమ్ లేదు. సరైన బౌలింగ్ యూనిట్ లేదు.

దీపక్ చాహార్, పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కంట్రోల్ చేస్తాడు. అతను గాయం కారణంగా తప్పుకున్నాడు. దీపక్ చాహార్ గాయపడితే, అతని ప్లేస్‌లో ఎవరిని ఆడించాలనే ఆలోచన లేకుండా జట్టుని ఎంచుకున్నారు.

బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటర్లు కూడా స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. టీమ్ ఇలా ఉంటే, కెప్టెన్ ఎవ్వరైతే మాత్రం ఏం చేస్తారు?, విజయాలు ఎలా సాధించగలుగుతారు. ఒకవేళ సొంత మైదానాల్లో లీగ్ జరుగుంటే మాత్రం చెన్నై ఈ జట్టుతో కూడా కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరేది. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్‌లో చెన్నైని ఆపడం కష్టం. సొంతమైదానంలో చెన్నై ఆటనే ఢిపరెంట్‌గా ఉంటుంది. ఢిల్లీ సైతం చెలరేగేది'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక వరుస విజయాలతో చెన్నై సూపర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Story first published: Wednesday, May 18, 2022, 16:11 [IST]
Other articles published on May 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+