Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. టీవీ పగలగొట్టిన ధోనీ: హర్భజన్ సింగ్

టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన భావోద్వేగాలను ప్రదర్శించడు. జట్టు ఓడినా బాధపడడు. గెలిచినా ఎగిరి గంతేయడు. దాంతోనే ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు.
అయితే ధోనీ కూడా తన భావోద్వేగాలను ప్రదర్శించేవాడని, తన కోపాన్ని అదుపు చేసుకోలేని ఘటనలు చాలా ఉన్నాయని అతనితో కలిసి ఆడిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా తాజాగా వెల్లడిస్తున్నారు. టీవీ కెమెరాలకు కనిపించకుండా ధోనీ తన భావోద్వేగాలను ప్రదర్శించేవాడని పేర్కొంటున్నారు.

ఆర్‌సీబీ చేతిలో ఓటమి..
తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ధోనీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా ధోనీ సహనం కోల్పోయి టీవీ పగలగొట్టాడని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Harbhajan Singh Says MS Dhoni Punched Screen After RCB defeated CSK In IPL 2024

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. మరోవైపు ఆర్‌సీబీ సంచలన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టుకు చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరమయ్యాయి.

ఆర్‌సీబీ సంబరాలతో..
యశ్ దయాల్ సంచలన బౌలింగ్‌తో ధోనీని ఔట్ చేయడంతో పాటు 7 పరుగులే ఇచ్చి ఆర్‌సీబీని ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఈ గెలుపుతో టైటిల్ గెలిచిన రీతిలో ఆర్‌సీబీ సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇద్దామని వచ్చిన ధోనీ.. వారు రాకపోవడంతో అక్కడున్న వారికి ఇచ్చి డగౌట్‌కు వెళ్లిపోయాడు.

అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇలా వెళ్లే క్రమంలో ధోనీ.. డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న టీవీని పగలగొట్టాడని హర్భజన్ సింగ్ తెలిపాడు. ఆ మ్యాచ్‌కు భజ్జీ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. 'సంచలన విజయంతో ఆర్‌సీబీ సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు నేను కామెంటేటర్‌గా వ్యవహరించాను.

సహనం కోల్పోయి..
మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ సంబరాలను పై నుంచి చూశాను. ఓవైపు బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు సీఎస్‌కే ఆటగాళ్లు వారికి కరాచలనం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. కానీ, ఆర్‌సీబీ ఆటగాళ్లు వారిని పట్టించుకోలేదు. దాంతో అసహనానికి గురైన ధోనీ.. అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్‌‌లోకి వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో బయట ఉన్న ఓ స్క్రీన్‌ను చేతిలో బలంగా బాదాడు. ప్రతీ ఆటగాడికి భావోద్వేగాలు ఉంటాయి. క్రీడల్లో ఇలాంటి ఘటనలు సహజం.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 3, 2024, 14:35 [IST]
Other articles published on Oct 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+