For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రస్సెల్‌నే వణికించాడు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతన్ని ఆడించాలి: హర్భజన్ సింగ్

Harbhajan Singh says Mohammed Siraj has shown remarkable improvement, should play WTC final
Mohammed Siraj should play WTC final over Ishant Sharma: Harbhajan Singh | Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. బౌలర్‌గా సిరాజ్ ఎంతో మెరుగయ్యాడని, అతన్ని ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడించాలన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కొత్త సిరాజ్‌ను తలపిస్తున్నాడని, అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిందని, అవకాశాల కోసం ఆకలిమీదున్నాడని కొనియాడాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా నెలకొంది.

సిరాజ్‌ను తీసుకుంటా..

సిరాజ్‌ను తీసుకుంటా..

తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఈ మెగాపోరులో బరిలోకి దిగే భారత తుది జట్టుపై తన అభిప్రాయలను పంచుకున్నాడు. టీమిండియా.. ఇషాంత్ శర్మ స్థానంలో సిరాజ్‌ను ఆడించాలని అభిప్రాయపడ్డాడు. 'నేనే కెప్టెన్ అయితే ముగ్గురు స్వచ్చమైన ఫాస్ట్ బౌలర్లను తీసుకుంటా. ఆ లెక్కన జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ అటోమెటిక్‌గా జట్టులోకి వస్తారు. మూడో పేసర్‌గా మాత్రం ఇషాంత్ శర్మకు బదులు మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంటా. ఇషాంత్ అద్భుతమైన బౌలరే. కానీ ఈ మ్యాచ్‌కు మాత్రం నా చాయిస్ సిరాజే.

ఆకలి మీదున్న పులిలా..

ఆకలి మీదున్న పులిలా..

ఎందుకంటే అతను గత రెండేళ్లుగా ఎంతో మెరుగయ్యాడు. సిరాజ్ ఇటీవల ప్రదర్శనలు గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో అతను అదరగొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా ఐదు వికెట్ల ఘనతను అందుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ ఫామ్, పేస్, ఆత్మవిశ్వాసమే ఫైనల్ మ్యాచ్‌కు అతనే సరైన వాడనిపించేలా చేశాయి. ముఖ్యంగా గత 6 నెలలుగా అతను రాణిస్తున్న విధానం చూస్తుంటే.. అవకాశాల కోసం ఆకలి మీదు ఉన్న పులిలా కనిపించాడు. మరోవైపు ఇషాంత్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతను భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశాడు.

రస్సెల్‌ను వణికించాడు..

రస్సెల్‌ను వణికించాడు..

ఒకవేళ పిచ్‌పై గ్రాస్ ఉంటే.. సిరాజ్ కీలకం అవుతాడు. అతని బౌలింగ్ ఆడటానికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఇబ్బందులు పడతారు. అతను డెక్ బాల్స్ వేయడమే కాకుండా బంతిని సమర్థవంతంగా స్వింగ్ చేయగలడు. బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టే యాంగిల్స్‌లో బంతులు సంధించగలడు. ఈ సీజన్ ఐపీఎల్ సందర్భంగా అతను కేకేఆర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్‌ను ఇబ్బంది పెట్టాడు. అది నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. మైదానం నలువైపుల బంతి బాదగల సామర్థ్యం ఉన్న రస్సెల్‌ను అడ్డుకోవడం అంత ఆశమాషి వ్యవహారం కాదు. కానీ సిరాజ్ కచ్చితమైన యార్కర్స్‌తో, సరైన ప్రదేశాల్లో బంతులను సంధిస్తూ అతన్ని ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్ వేగం కూడా పెరిగింది. టీమిండియాకు ఆడిన తర్వాత అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. 'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

సిరాజ్‌ను తీసుకునేందుకు..

సిరాజ్‌ను తీసుకునేందుకు..

కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం సాఫ్ట్ క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా బుధవారమే మైదానంలోకి అడుగుపెట్టింది. మెగా పోరుకు ముందున్న 8 రోజులే కోహ్లీసేన ప్రాక్టీస్ చేయనుంది. ప్రస్తుతం వార్మప్‌కు మాత్రమే పరిమితవ్వగా.. శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. ఆటగాళ్లు రెండు, మూడు గ్రూప్‌లుగా విడిపోయి సాధన చేయనున్నారు. అయితే ఈ 8 రోజులు జట్టులోని ఫాస్ట్ బౌలర్ల సత్తా పరీక్షగా నిలవనున్నాయి. మహ్మద్ సిరాజ్‌ను ఆడించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అదంతా సులువయ్యేలా లేదు. 2019లోని వెస్టిండీస్ పర్యటన తర్వాత తొలిసారి సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు అందుబాటులోకి వచ్చారు. గత మూడేళ్లుగా ఈ త్రయం విదేశీ గడ్డపై దుమ్మురేపింది. ప్రాక్టీస్ సెషన్‌లో సిరాజ్ అంచనాలను అందుకుంటే జట్టులో ఉండటం ఖాయం అని తెలుస్తోంది.

Story first published: Thursday, June 10, 2021, 22:32 [IST]
Other articles published on Jun 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+