For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేఎల్ రాహుల్ ఏం నేరం చేయలేదు.. అతన్ని వదిలేయండి.. హర్భజన్ సింగ్ ఫైర్!

 Harbhajan Singh Says KL Rahul hasnt done any crime amid Prasad vs Chopra heated debate

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్.. ట్విటర్ వేదికగా మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రా, వెంకటేశ్ ప్రసాద్‌ల మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. కేఎల్ రాహుల్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా సెలెక్షన్ తీరును వెంకటేశ్ ప్రసాద్ తప్పుబట్టగా.. వ్యక్తిగత అజెండాతోనే అలా మాట్లాడుతున్నాడని ఆకాశ్ చోప్రా కౌంటరిచ్చాడు. దాంతో ఈ మాజీ ఆటగాళ్లు ఇద్దరూ వరుస ట్వీట్లతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ట్విటర్ వార్‌పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకనైన ఈ విమర్శలు, మాటల యుద్దాన్ని ఆపాలని ట్విటర్ వేదికగా కోరాడు.

రాహుల్ ఏం నేరం చేయలేదు..

కేఎల్ రాహుల్ ఏం నేరం చేయలేదని, అతనో టాప్ క్లాస్ ఇండియన్ ప్లేయరని, అందరిలానే అతను కెరీర్‌లో విషమ దశను ఎదుర్కొంటున్నాడని ట్వీట్ చేశాడు. 'కేఎల్ రాహుల్‌ను వదిలేయండి. అతను ఏం నేరం చేయలేదు. అతను ఇప్పటికీ టాప్ ప్లేయరే. అతను నేలకు కొట్టిన బంతిలా పుంజుకోగలడు. మనమందం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి విషమ దశను ఎదుర్కొన్నవాళ్లమే. ఫామ్ కోల్పోయింది అతనొక్కడే కాదు. దయచేసి వాస్తవాన్ని గ్రహించి అతన్ని గౌరవించండి. అతను మన భారత ప్లేయరనే విషయాన్ని మరిచిపోకండి. అతనిపై కాస్త నమ్మకం ఉంచండి'అని హర్భజన్ సింగ్ కోరాడు.

అందుకే వైస్ కెప్టెన్సీ పీకేసారు..

అందుకే వైస్ కెప్టెన్సీ పీకేసారు..

ఇదే హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్ట్‌ల్లో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఉండకపోవచ్చని తెలిపాడు. వైస్ కెప్టెన్సీ పీకేయడం దీనికి సంకేతమని చెప్పుకొచ్చాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. 'కేఎల్ రాహుల్ టాప్ క్లాస్ ప్లేయర్. కానీ అతను పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. బహుషా జట్టు నుంచి తప్పించేందుకే రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారనుకుంటున్నా. అతని స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగడం ఖాయం. రాహుల్ మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

గణంకాలతో సహా వాగ్వాదం..

గణంకాలతో సహా వాగ్వాదం..

కేఎల్ రాహుల్‌కు సేన (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మంచి రికార్డ్ ఉందంటూ వాటికి సంబంధించిన గణాంకాలను ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. బహుశా అందుకే సెలెక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డాడు. ఇక తాను బీసీసీఐ నుంచి ఎలాంటి పదవిని కూడా ఆశించడం లేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత అజెండా అంటూ చేసిన ఆరోపణలపై వెంకటేశ్ ప్రసాద్ ఘాటుగా స్పందించాడు. 2012లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌ను ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను బయటపెట్టిన వెంకటేశ్ ప్రసాద్.. భిన్నాభిప్రాయం ఉన్నంత మాత్రాన దాన్ని వ్యక్తిగత అజెండా అనలేమ గట్టిగా కౌంటరిచ్చాడు. ఆకాశ్ చోప్రా తనతో ఏకీభవించకపోవచ్చని, కానీ అతడి వివరణ పూర్తి భిన్నంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

నువ్వు నాలుగేళ్ల ప్లేయర్‌ను ప్రశ్నించవచ్చు..?

నువ్వు నాలుగేళ్ల ప్లేయర్‌ను ప్రశ్నించవచ్చు..?

2012లో అజింక్యా రహానేను కాదని టెస్టు జట్టులోకి రోహిత్ శర్మ తీసుకోవడంపై ఆకాశ్ చోప్రా సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు 'రహానేకు తుది జట్టులో చోటు దక్కలేదు. 'ప్రతిభావంతుడైన' రోహిత్‌కు దక్కింది'అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ట్వీట్‌ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన వెంకటేశ్ ప్రసాద్.. 'అంతర్జాతీయ క్రికెట్లో నాలుగేళ్ల అనుభవం ఉన్న 24 ఏళ్ల క్రికెటర్‌ గురించి నువ్వు వ్యంగ్యంగా మాట్లాడొచ్చు కానీ.. 8 ఏళ్లుగా సరైన ఆటతీరు కనబర్చని ఆటగాడి గణాంకాలను మాత్రం నేను బయటపెట్ట వద్దా?'అని ఆకాశ్ చోప్రా తీరును విమర్శించాడు. వ్యక్తిగతంగా చోప్రాతో తనకు ఎలాంటి గొడవలు లేవన్న వెంకటేశ్ ప్రసాద్.. అతని యూట్యూబ్ విశ్లేషణలను తాను ఇష్టపడతానని చెప్పాడు.

Story first published: Wednesday, February 22, 2023, 10:52 [IST]
Other articles published on Feb 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+