Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harbhajan Singh: అఫ్గానిస్థాన్‌ను లైట్ తీసుకుంటే అంతే! టీమిండియాకు భజ్జీ వార్నింగ్!

Harbhajan Singh says India cannot take Afghanistan lightly, they are a very good and mature team
T20 World Cup: రికార్డుల గురించి వద్దమ్మా.. సూపర్ ఫామ్‌లో అఫ్గానిస్థాన్ |IND VS AFG| Oneindia Telugu

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో నేడు జరిగే మ్యాచ్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని భారత ఆటగాళ్లను వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ హెచ్చరించాడు. ప్రస్తుత టోర్నీలో అఫ్గానిస్థాన్ సూపర్ ఫామ్‌లో ఉందని, టీ20ల్లో ఫలితాన్ని ఏమాత్రం ఊహించలేమని తెలిపాడు. న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో చిత్తుగా ఓడిన భారత్.. సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది.

టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇక అఫ్గాన్ మ్యాచ్ నేపథ్యంలో స్పోర్ట్స్‌ కీదా‌తో మాట్లాడిన హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ రూపంలో నబీ బృందానికి చక్కటి స్పిన్‌ ద్వయం ఉందని.. వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే మెరుగైన ఫలితాలు దక్కుతాయని అభిప్రాయపడ్డాడు.

లైట్ తీసుకుంటే అంతే..

లైట్ తీసుకుంటే అంతే..

'అఫ్గానిస్థాన్​ను తేలికగా తీసుకోవద్దు. ఆ జట్టు చాలా అనుభవం కలిగింది. అద్భుత బ్యాటర్లు, ముజిబుర్ రెహ్మన్, రషీద్ ఖాన్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఆ టీమ్​లో ఉన్నారు. టీ20ల్లో ఎవరు గెలుస్తారో ఊహించడం కష్టం. తొలి 6 ఓవర్లలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో వారికే మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్​లో పుంజుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అఫ్గానిస్థాన్​పై భారత్ మెరుగైన రికార్డు ఉంది కదా అన్న ప్రశ్నకు భజ్జీ తనదైన శైలిలో బదులిచ్చాడు.

గత రికార్డులు దండుగ..

గత రికార్డులు దండుగ..

'ఓ క్రికెటర్​గా నేను గత రికార్డుల గురించి పట్టించుకోను. ఒకసారి జరిగింది మళ్లీ జరుగుతుందని చెప్పలేం. అసలు అలాంటి గణాంకాలు నా దృష్టిలో శుద్ధ దండుగ. గతంలో జరిగింది అచ్చంగా అలాగే జరుగుతుందని అనుకోకూడదు. ఉదాహరణకు పాకిస్థాన్​ను 12 సార్లు ఓడించాం. మరి 13వ సారి అలాగే గెలవాలి కదా. గతాన్ని మనం మార్చలేం. ప్రస్తుతం మన ఆట తీరు ఎలా ఉందన్న అంశాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మన చేతిలో ఓడినప్పుడు అఫ్గన్‌ అప్పుడప్పుడే ఎదుగుతున్న జట్టు. కానీ ఇప్పుడు ఆ జట్టు బలంగా తయారైంది. పెద్ద జట్లను ఓడించే సామర్థ్యం ఈ జట్టుకు ఉంది" అని వెల్లడించాడు.

అఫ్గాన్‌తోనైనా..

అఫ్గాన్‌తోనైనా..

టోర్నీలో టీమిండియా వైఫల్యం చూస్తుంటే అఫ్గాన్‌తోనైనా గెలుస్తుందా? అనే సందేహం కలుగుతోంది. అఫ్గానిస్థాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్‌ రెండుసార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్‌ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్‌ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్‌ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్‌ గెలిచేదేమో! కాబట్టి టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒకవైపు వికెట్లు పడినా, మరోవైపు ఆత్మరక్షణలో పడకుండా ధాటిగా ఆడుతూ చకచకా పరుగులు సాధించగల బ్యాట్స్‌మెన్‌ జట్టులో ఉన్నారు.

Story first published: Wednesday, November 3, 2021, 16:28 [IST]
Other articles published on Nov 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+