Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా: హర్భజన్ సింగ్

 Harbhajan Singh Says I Couldnt India Captain Because I Had no One in The BCCI
BCCI Is More Intrested On MS Dhoni - Harbhajan Singh | Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో తెలిసినోడు లేకనే భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకోలేకపోయానని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. భారత జట్టును నడిపించాలంటే బోర్డు పెద్దల నుంచి మద్దతు ఉండాలని చెప్పాడు. లేకుంటే ఆ గౌరవం దక్కదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే భారత జట్టుకు కెప్టెన్ అయ్యే సామర్థ్యం తనకు ఉందని భజ్జీ తెలిపాడు. ఇక కెప్టెన్ కాలేదనే పశ్చాతాపం అయితే తనకు లేదని, ఓ ప్లేయర్‌గా దేశానికి సేవ చేయడం తనకు ఎప్పుడూ సంతోషమేనని చెప్పాడు.

ఇటీవలే అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్.. అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్ నుంచి సపోర్ట్ స్టాఫ్ మెంబర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఓ టాప్ ఫ్రాంచైజీకి అతను మెంటార్‌గా సేవలందించనున్నాడు. ఈ క్రమంలోనే న్యూస్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భజ్జీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

 ఎవరూ తెలియకపోవడంతోనే..

ఎవరూ తెలియకపోవడంతోనే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా చాంపియన్స్ లీగ్ ట్రోఫీ అందించడాన్ని ఎవరూ పెద్దగా మాట్లాడరు ఎందుకని ప్రశ్నించగా.. భజ్జీ పై విధంగా బదులిచ్చాడు. ‘నా కెప్టెన్సీలో నేను సాధించిన ఈ ఘనత గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు. నాకు బీసీసీఐలో ఎవరూ తెలియకపోవడమే దీనికి కారణం. భారత జట్టుకు సారథ్యం వహించాలంటే బోర్డు పెద్దల నుంచి మద్దతు అవసరం. పవర్ ఫుల్ మెంబర్స్ నుంచి నీకు అలాంటి సపోర్ట్ లేకుంటే కెప్టెన్సీ దక్కదు. కెప్టెన్‌గా నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. ఎంతో మంది కెప్టెన్లకు దిశానిర్దేశం చేశాను. భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నానా? లేదా? అనేది పెద్ద విషయమే కాదు. అయినా కెప్టెన్సీ చేయలేదని నాకు ఎలాంటి పశ్చాతాపం లేదు. ప్లేయర్‌గా దేశానికి సేవచేయడం ఎప్పుడూ నాకు సంతోషమే.'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

కుంబ్లే గొప్ప మ్యాచ్ విన్నర్..

కుంబ్లే గొప్ప మ్యాచ్ విన్నర్..

అనిల్ కుంబ్లేతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించగా.. దిగ్గజ స్పిన్నర్‌పై హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నాకున్న క్రికెట్ పరిజ్ఞానం మేరకు అనిల్ కుంబ్లే కంటే పెద్ద మ్యాచ్ విన్నర్ లేడు. అతనితో కలిసి ఆడటం నేను చేసుకున్న అదృష్టం. చాలా సందర్భాల్లో అతన్ని కాదని నన్ను తుది జట్టులోకి తీసుకున్నారు. 2003 ప్రపంచకప్‌లో కూడా కుంబ్లేను కాదని నాకే అవకాశం ఇచ్చారు. అయితే ఈ విషయంలో కుంబ్లే ఎప్పుడూ ఆందోళన చెందలేదు. కుంబ్లేను గొప్ప బౌలర్ అనడం కంటే పది రెట్లు మెరుగైన వ్యక్తని చెప్పవచ్చు.'అని తెలిపాడు.

ధోనీని నేను పెళ్లి చేసుకోలేదు..

ధోనీని నేను పెళ్లి చేసుకోలేదు..

మాజీ కెప్టెన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ‌తో సాన్నిహిత్యం ఎలా ఉండేదని ప్రశ్నించగా.. బాగుండేదని చెప్పిన భజ్జీ.. అతన్ని తాను పెళ్లి చేసుకోలేదని సెటైర్లు పేల్చాడు. ధోనీతో మీకు పడేది కాదనే ప్రచారం ఉందని ప్రశ్నించగా.. భజ్జీ తనదైన శైలిలో బదులిచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చుకున్నారని తెలిపాడు. 2011 ప్రపంచకప్ తర్వాత ఆ జట్టు మళ్లీ ఎందుకు ఆడలేదని భజ్జీ ప్రశ్నించాడు. సెహ్వాగ్, గంభీర్‌తో పాటు తాను ఐపీఎల్ ఆడుతుండగానే జట్టుకు దూరం కావాల్సి వచ్చిందన్నాడు.

 ధోనీని నిందించడం లేదు..

ధోనీని నిందించడం లేదు..

అయితే దీనికి ధోనీని నిందించడం లేదని, అతను తనకు మంచి స్నేహితుడిగా ఉన్నాడని భజ్జీ తెలిపాడు. తాను బీసీసీఐ, అప్పటి సెలెక్టర్లను తప్పుబడుతున్నానని చెప్పాడు. ఆ సమయంలో ఉన్న సెలెక్టర్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయారని విమర్శించాడు. జట్టులో సీనియర్ ఆటగాళ్లు రాణిస్తున్నా.. వారిని పక్కనపెట్టి యువ ఆటగాళ్లను తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఇదే విషయంపై సెలెక్టర్లను నిలదీస్తే తమ చేతుల్లే ఏం లేదని చెప్పారని, అలాంటప్పుడు వాళ్లు సెలెక్టర్లుగా ఉండటం దేనికని భజ్జీ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, January 31, 2022, 15:51 [IST]
Other articles published on Jan 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+