Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డీఎస్పీ సిరాజ్.. ట్రావిస్ హెడ్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అరెస్ట్ చేయ్: భజ్జీ (వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన గొడవపై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోకులు పేల్చాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ట్రావిస్ హెడ్ హైదరాబాద్‌ వచ్చినప్పుడు డీఎస్పీ హోదాలో అరెస్ట్ చేయాలని సిరాజ్‌కు హర్భజన్ సింగ్ సూచించాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. వన్డే తరహా బ్యాటింగ్‌తో 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 140 పరుగులు చేశాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ట్రావిస్ హెడ్‌ను మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు.

Harbhajan Singh says DSP Siraj when Travis Head comes to Hyderabad for IPL do arrest him

అనంతరం ఆగ్రహంగా సంబరాలు చేసుకోగా.. ట్రావిస్ హెడ్ నోటికి పనిచెప్పాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సిరాజ్.. 'ఛల్ పో బే.. పో'అన్నట్లు సైగ చేశాడు. ఈ ఘటన తీవ్ర వివాదస్పదమైంది. ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో సిరాజ్ విలన్‌గా మారాడు. దాంతో వారు మ్యాచ్ అసాంతం సిరాజ్‌ను గేలి చేశారు. మరోవైపు సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం సిరాజ్ తీరును తప్పుబట్టారు. రెండో రోజు ఆట అనంతరం ఈ వివాదాస్పద ఘటనపై ట్రావిస్ హెడ్ స్పందించాడు.

మెచ్చుకుంటే తిట్టాడు..
తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నానని, అతను మాత్రం అపార్థం చేసుకున్నాడని తెలిపాడు. సిరాజ్ రియాక్షన్‌ తనకు నచ్చలేదన్నాడు. దాంతో సిరాజ్‌పై భారత అభిమానులు కూడా ట్రోలింగ్ దిగారు. తాజాగా ట్రావిస్ హెడ్ వ్యాఖ్యలపై సిరాజ్.. స్టార్ స్పోర్ట్స్‌ హోస్ట్‌ హర్భజన్ సింగ్‌తో కలిసి మాట్లాడాడు. ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడని స్పష్టం చేశాడు.

Harbhajan Singh says DSP Siraj when Travis Head comes to Hyderabad for IPL do arrest him

అబద్దాలు ఆడుతున్నాడు..
'ట్రావిస్ హెడ్‌కు బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదించాను. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మా మధ్య పోరు హోరాహోరీగా సాగింది. మంచి బంతికి బ్యాటర్ సిక్స్‌ కొడితే ఏ బౌలర్‌కైనా బాధగా ఉంటుంది. అది నాలో కసిని పెంచింది. ఆ వెంటనే నేను అతన్ని ఔట్ చేసి సంబరాలు చేసుకున్నా. ట్రావిస్ హెడ్ మాత్రం నా సంబరాలను తట్టుకోలేక తిట్టాడు. టీవీ రిప్లేలు చూస్తే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రారంభంలో నేను సంబరాలు మాత్రమే చేసుకున్నాను.

ట్రావిస్ హెడ్‌ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రావిస్ హెడ్ తప్పుగా చెప్పాడు. బాగా బౌలింగ్ చేశావ్ అని మెచ్చుకున్నానని అబద్దాలు ఆడాడు. అలా అతను అనలేదు. నేను అందరీతో మర్యాదగా నడుచుకుంటాను. ఎందుకంటే క్రికెట్ జెంటిల్‌మన్ గేమ్. ట్రావిస్ హెడ్ తీరు వల్ల నేను బాధపడ్డాను.'అని సిరాజ్ వివరణ ఇచ్చాడు. వెంటనే హర్భజన్ సింగ్.. డీఎస్పీ హోదాలో అతన్ని అరెస్ట్ చేయాలని నవ్వుతూ సూచించాడు.

ఐపీఎల్‌లో ట్రావిస్ హెడ్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.

Story first published: Sunday, December 8, 2024, 10:47 [IST]
Other articles published on Dec 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+