టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికాడు: హర్భజన్ సింగ్
టీమిండియాకు మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మాజీ డాషింగ్ ఓపెనర్ తరహాలోనే ఆడుతున్నాడని, అతి త్వరలోనే అతను సెహ్వాగ్‌లా మూడు ఫార్మాట్లలో రాణిస్తాడని కొనియాడాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో అభిషేక్ శర్మ(54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో 135) విధ్వంసకర శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. తనకే సాధ్యమైన హిట్టింగ్‌తో విరుచుకుపడిన అభిషేక్ శర్మ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 35 బంతు్లోనే శతకం సాధించాడు.
ఈ క్రమంలోనే టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు, వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. దాంతో ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడిన హర్భజన్ సింగ్.. అతని బ్యాటింగ్‌ను వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. 'అభిషేక్ శర్మను త్వరలోనే మనం మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా చూడబోతున్నాం. అతను టెస్ట్‌ల్లో కూడా దూకుడుగా ఆడగలడు. రంజీ ట్రోఫీలో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అభిషేక్ శర్మ తనదైన రోజున చెలరేగి మ్యాచ్ గమనాన్నే మార్చేస్తాడు.

గతంలో వీరేంద్ర సెహ్వాగ్, వివ్ రిచర్డ్స్ ఇలానే దూకుడుగా ఆడేవారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ కూడా ఇదే తరహా బ్యాటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే అభిషేక్ శర్మ కూడా టెస్ట్‌ల్లో సెహ్వాగ్‌లా దూకుడుగా ఆడనున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే సెహ్వాగ్ లాంటి ఆటగాడు జట్టుకు ఎప్పుడూ అవసరమే. అలాంటి సత్తా అభిషేక్ శర్మకు ఉంది.
బ్యాటర్‌గానే కాకుండా అభిషేక్ శర్మ బౌలింగ్‌లోనూ రాణించగలడు. అతన్ని కలిసిన ప్రతీసారి నేను బౌలింగ్ గురించే మాట్లాడుతాను. ఎందుకంటే అతనిలో మంచి స్నిన్నర్ ఉన్నాడు. అతనికి ఇష్టమైన బ్యాటింగ్‌ను ఎలాగూ సాధన చేస్తాడు. ఆ విషయంలో అతనికి తిరుగులేదు. కానీ బౌలర్‌గా మాత్రం అతను చాలా ప్రాక్టీస్ చేయాలి. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఎదిగే నైపుణ్యం అతనిలో ఉంది. కష్టపడే తత్వం కూడా ఎక్కువే కాబట్టి బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాలని చెప్పాను.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications